తెలంగాణ

telangana

ఉమ్మడి మెదక్​ జిల్లాలో వరుణుడి బీభత్సం - అత్యవసర సేవలకై ప్రత్యేక టోల్​ఫ్రీ నంబర్​ ఏర్పాటు - Heavy Rains in Medak District

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 12:43 PM IST

Updated : Sep 1, 2024, 1:52 PM IST

Heavy Rains in Medak District : ఉమ్మడి మెదక్​ జిల్లాను వరుణుడు వణికిస్తున్నాడు. కుండపోత వానకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులను తలపించేలా రహదారులు మారడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లా పాతూరులో 20.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది.

Heavy Rainfall in Medak Today
Heavy Rains in Medak District (ETV Bharat)

Heavy Rainfall in Medak Today :బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. జిల్లాలో పలు ప్రాంతాలలో రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విస్తారంగా కురుస్తున్న వానలకు 396 చెరువులు నిండుకుండాల మారి వాగులు, కుంటలు మత్తడి పారుతున్నాయి. అత్యవసర సేవలకు మెదక్ కలెక్టరేట్​లో 24 గంటలు పనిచేసే విధంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ నంబర్ 9391942254 ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

Medak Rainfall Record : గడిచిన 24 గంటల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఉమ్మడి మెదక్​ జిల్లా అతలాకుతలమవటంతో పాటు పాతూరులో 21 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. దీంతో మెదక్ మండలంలో ఉన్న కుంటలు చెరువులు, వాగులు, రాయన్​పల్లి ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. రాజ్​పల్లి 17.4, మెదక్ 14, హవేలీ ఘన్​పూర్ మండలం నాగపూర్​లో 13.5, వెల్దుర్తి మండలం దామరంచలో 12.5, కొల్చారం మండల కేంద్రంలో 11.5 సెంటిమీటర్​ల వర్షపాతం నమోదయింది.

రామాయంపేట్, మనోహరాబాద్ మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదయింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం కూడవెల్లి వాగు వద్ద ఉన్న లోతట్టు వంతెనపై వర్షపు నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎవరు వాగు దాటకుండా గ్రామపంచాయతీ సిబ్బంది ముళ్లకంప వేశారు.

పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు:చెరువులోకి వర్షపు నీరు భారీగా చేరింది. చెరువుల్లో వరద నీరు వచ్చి చేరడంతో అలుగులు పారుతున్నాయి. చెక్ డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉండడంతో ఆయా అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షం కురిసిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో రహదారులు జలమయంగా మారాయి. శివాజీ చౌరస్తా హై స్కూల్​కు వెళ్లే రహదారి ప్రాంతంలోని పలు ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. రహదారి చెరువును తలపించేలా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు రహదారిపై ప్రవహించడంతో ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. మురుగు కాలువల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో అవస్థలు ఏర్పడ్డాయని ప్రజలు వాపోతున్నారు.

భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం - పరీవాహక ప్రాంత వాసుల్లో టెన్షన్​, టెన్షన్ - Godavari River Water Level Rises

హైదరాబాద్​ పరిసరాల్లో భారీ వర్షం - మూసీ నదికి పోటెత్తిన వరద ప్రవాహం - Heavy Flood Water To Yadadri Musi

Last Updated : Sep 1, 2024, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details