తెలంగాణ

telangana

ETV Bharat / state

నాలాల ఆక్రమణలతో - చినుకు పడితే చెరువులను తలపిస్తున్న మహబూబ్​నగర్ పట్టణ లోతట్టు ప్రాంతాలు - Mahabubnagar people FLOOD problems - MAHABUBNAGAR PEOPLE FLOOD PROBLEMS

Mahabubnagar Public Facing Problems With Sewage Overflow : భారీ వర్షాలు కురిస్తే పాలమూరు పట్టణం పెద్దచెరువు కింద లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం పరిపాటిగా మారింది. గతంలో మహబూబ్‌నగర్ పట్టణంలోని మురుగునీరంతా గతంలో 3ప్రధాన మురుగు కాల్వల ద్వారా పెద్ద చెరువులోకి చేరేది. చెరువుల అలుగు పారే కాల్వలు, కబ్జాకు గురై కుంచించుకుపోయాయి. దీంతో పట్టణంలోని మురుగు నీరంతా లొతట్టు ప్రాంతాలకు చేరుతున్న నేపథ్యంలో మురుగు నీటి సమస్యపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Sewage Overflow
Sewage Overflow (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 19, 2024, 8:37 AM IST

నాలాల ఆక్రమణలతో - చినుకు పడితే చెరువులను తలపిస్తున్న మహబూబ్​నగర్ పట్టణ లోతట్టు ప్రాంతాలు (ETV Bharat)

Public Facing Problems With Sewage Overflow in Mahabubnagar :వానాకాలం వచ్చిందంటే చాలు, మహబూబ్‌నగర్ పట్టణంలోని లోతట్టు కాలనీల ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. ముంపు నివారణకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మారుతున్నాయి. ఈసారి కూడా
అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నా, నాలాలపై ఆక్రమణలు తొలగించకుండా ముంపు నివారణ ఎలా సాధ్యమని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు.

భారీ వర్షాలు కురిస్తే పాలమూరు పట్టణం పెద్దచెరువు కింద లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం పరిపాటిగా మారింది. ముంపు నివారణకు చర్యలు చేపడుతున్నా పూర్తికాకపోవడం, అమల్లోకి రాకపోవడంతో ఏటా పట్టణంలోని చాలా ప్రాంతాలు వరదమయమవుతున్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలోని మురుగునీరంతా గతంలో 3ప్రధాన మురుగు కాల్వల ద్వారా పెద్ద చెరువులోకి చేరేది. కాస్త పెద్దవర్షం కురిస్తే, చెరువు నిండి బీకే రెడ్డి కాలనీ, రామయ్యబౌలీ రెండు వైపులా అలుగుల నుంచి వరద పోటెత్తి లోతట్టు కాలనీలు జలమయమయ్యేవి. అలాకాకుండా పట్టణం నుంచి వచ్చిన మురుగంతా చెరువులోకి చేరకుండా పెద్దకాల్వల ద్వారా నేరుగా బయటికి వెళ్లే ఏర్పాటు చేశారు. కానీ గతేడాది వచ్చిన వరదకు కాల్వల సామర్థ్యం సరిపోక వరద బయటికి పొంగి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ముంపు నివారణకు పెద్దచెరువును మళ్లీ మురుగుతోనే నింపాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ మార్గంగా బీకే రెడ్డికాలనీ, రామయ్య బౌలీ రెండు వైపులా వెడల్పాటి కాల్వలను నిర్మించారు. కానీ అవి కొద్దిదూరం వరకే నిర్మించగా, ఆ దిగువన కాల్వల సామర్థ్యం రెండు,మూడు అడుగుల వెడల్పుకే పరిమితమైంది. ఇప్పుడు అధికంగా వర్షాలు కురిసినా, కాల్వల సామర్థ్యం తక్కువగా ఉన్న చోట లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే చెరువుకు రెండు వైపులా వరద కాల్వలను పట్టణం చివరి వరకూ నిర్మించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏళ్లలో పెద్ద చెరువు అలుగు పారే కాల్వలు, కబ్జాకు గురై కుంచించుకుపోయాయి. వాటిని ఇప్పటికైనా విస్తరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

'గతంలో పెద్ద చెరువు నిండితే తూము ద్వారా నీళ్లు బయటికి వెళ్లే అవకాశం లేదు. ప్రస్తుతం తూమును పునరుద్ధరించడంతో పాటు, చెరువు నిండితే తూము ద్వారా కూడా వరద నీళ్లు బయటికి వెళ్లే ఏర్పాటు చేశారు. పెద్దచెరువు రెండు వైపులా ఉండే ప్రధాన మురుగు కాల్వల నుంచి నేరుగా మురుగు బయటికిపోతోంది. ఒకవేళ కాలువ సామర్థానికి మించి వరద వస్తే, ఆ వరద కాలనీలను ముంచెత్తకుండా చెరువులోకి చేరేలా నెట్‌లు ఏర్పాటు చేశారు. బీకే రెడ్డి కాలనీవైపు ఉన్న అలుగుతో వర్షాకాలంలో ముంపు సమస్య ఎక్కువ అవుతోంది. ఈ అలుగు వద్ద వరదను డైవర్ట్ చేయడానికి వరద కాల్వను నిర్మిస్తున్నారు. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ కాల్వను 40 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో నిర్మించారు. అలాగే అవసరం ఉన్న చోట్ల బాక్స్ డ్రెయిన్స్ నిర్మిస్తున్నారు. ఇవేకాకుండా నాలాల్లో పూడిక తీత, కల్వర్టులను శుభ్రం చేయడం లాంటి పనులు చేపట్టాం. మహేశ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌

వరద నివారణకు చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నా, ఆక్రమణల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పట్టణంలోని రామయ్య బౌలీ అలుగు వద్ద బాక్స్ డ్రైన్‌ను నిర్మించారు. ఆ తర్వాత వరద వెళ్లేందుకు కాల్వ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆ కాల్వ నిర్మించాలంటే ఆ మార్గంలో ఉన్న ఆక్రమణలను తొలగించాల్సి ఉంది. ఇప్పటికే ఆక్రమణలను గుర్తించి మార్కింగ్ చేసినా వాటిని తొలగించలేదు. పెద్ద కాల్వను నిర్మించలేదు. ఆక్రమణలు తొలగించకుండా ముంపు నివారణ ఎలా సాధ్యమన్న ప్రశ్న సైతం పురవాసుల నుంచి తలెత్తుతోంది. దీంతో పాటుపెద్దచెరువుకు వరదను మోసుకొచ్చే వాగులు సైతం కబ్జాలకు గురయ్యాయి. కబ్జాలను తొలగించి ముంపు సమస్యను శాశ్వతంగా తీర్చాలని పట్టణవాసులు కోరుతున్నారు.


రైతులకు గుడ్​ న్యూస్​ - త్వరలో కొత్త వ్యవసాయ పంట బీమా పథకం అమలు - Crop Insurance in Telangana

హైదరాబాద్​లో 25 వేల మ్యాన్​హోల్స్ - మూత తెరిచారో మునిగిపోతారు!! - MANHOLE SAFETY MEASURES IN HYD

ABOUT THE AUTHOR

...view details