Hyderabad Rains Toady : హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొంటుంది. సాయంత్రమైతే చాలు నగరవాసులకు వాన చినుకు పలకరిస్తుంది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో విలవిల్లాడిన ప్రజలకు కొంత ఉపశమనం కల్గిస్తున్నా, పలుచోట్ల కురుస్తున్న భారీ వానలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. భాగ్యనగరంలోని చాలా ప్రాంతాల్లో ఇవాళ వాన జల్లులు కురిసాయి. దీంతో రోడ్లపై వరదనీరు వచ్చి చేరింది. హైదరాబాద్లోని జీడిమెట్ల, గాజులరామారం, సూరారం, పేట్ బషీరాబాద్, కొంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వాన కురవగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Telangana Monsoon Report Today : రాష్ట్రంలో ఈ రోజు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. గురువారం అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.