Heavy Rain in Hyderabad and Secunderabad : అధిక ఉష్ణోగ్రత ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగరవాసులకు వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వాతావరణం చల్లబడింది. ఈ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, చిలకలగూడ, పారడైజ్, బేగంపేట, కవాడిగూడ, బాగ్‌లింగంపల్లి, జవహర్‌నగర్, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోరబండ, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, గాంధీనగర్, దోమలగూడ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్, భోలక్‌పూర్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, సైదాబాద్, చంపాపేట్, లక్డీకపూల్, హిమాయత్‌నగర్, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మ ప్రాంతాల్లో వర్షం పడింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రహదారులు అన్నీ జలమయమయ్యాయి. రహదారులు, కాలనీల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రజానికం ఇబ్బంది పడ్డారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం నీరు మొత్తం రోడ్లపై పారుతుండడంతో ఎక్కడ ఏ మ్యాన్‌హోల్ ఉందోనని జనం భయం గుప్పిట్లో ఉన్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.