Heavy Rains In Hyderabad : ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడుతున్న హైదరాబాద్ వాసులకు వర్షం ఉపశమనం కలిగించింది. నగరంలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. సచివాలయం, లక్డీకపూల్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట్, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట్, ప్రగతినగర్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌లో భారీ వర్షం కురిసింది. గండి మైసమ్మ నుంచి బాచుపల్లి వెళ్లే రహదారిలో వర్షరు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో ప్రధాన రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంజాగుట్ట-అమీర్‌పేట రహదారి చెరువును తలపించేలా వరద నీటితో నిండిపోయింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని హైడ్రా సిబ్బంది తొలిగిస్తున్నారు.