Heavy Rains In Hyderabad :హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భాారీ వర్షం కురిసింది. భాగ్యనగరంతో పాటు నగర శివార్లలోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కొండాపూర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లిలో వర్షం దంచికొట్టింది. సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమై హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, కేపీహెచ్‌బీకాలనీ ప్రాంతాలను వాన ముంచెత్తింది.
మరోవైపు మూసాపేట్, నిజాంపేట్, ప్రగతినగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండి మైసమ్మ, మల్లంపేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతంలో కొద్ది సేపట్లోనే భారీవర్షం పడింది. ఫలితంగా రహదారులపైకి భారీగా వాననీరు చేరి ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆఫీసులు వదిలే సమయం కావడంతో రద్దీ పెరిగి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
వాహనదారులకు తప్పని తిప్పలు :ఎండ వేడితో ఇబ్బందిపడే నగర వాసులను మధ్యాహ్నం 3గంటల సమయంలో కురిసిన వర్షం చల్లదనాన్నిచ్చింది. కూకట్‌పల్లి ప్రాంతంలో కొద్దిసేపు కురిసిన వర్షం కారణంగా ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు మెట్రో పిల్లర్ల కింద నిలబడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం లింగంపల్లి చందానగర్ మియాపుర్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చందానగర్ ముంబై జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ పనులు జరుగుతుండటంతో రహదారి పై భారీగా వరద నీరు వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.