Heavy Rain Alert To Telangana :రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడన ప్రభావం బుధవారం బలహీనపడిందని, దీని అనుబంధ ఉపరితల అవర్తనం దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని వివరించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో రెండు రోజులు వానలే వానలు - Heavy Rain Alert To Telangana - HEAVY RAIN ALERT TO TELANGANA
Heavy Rain Alert To Telangana : బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడం బలహీనపడిన కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో వానలు పడే అవకాశముందని తెలిపింది.
Published : Sep 26, 2024, 7:37 AM IST
దీని ప్రభావం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. బుధవారం ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 123.3 మి.మీ., సూర్యాపేట జిల్లా టేకుమట్లలో 56.5 మి.మీ., ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్‌లో 46, వరంగల్ జిల్లా ఏనుగల్‌లో 45, సంగారెడ్డి జిల్లా మాల్‌చెల్మలో 44.8, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 42.8 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు.