తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ పరిసరాల్లో భారీ వర్షం - మూసీ నదికి పోటెత్తిన వరద ప్రవాహం - Heavy Flood Water To Yadadri Musi - HEAVY FLOOD WATER TO YADADRI MUSI

Heavy Flood Water To Yadadri Musi River : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లో లెవల్ బ్రిడ్జిని తాకుతూ మూసీ నది ప్రవహిస్తోంది. ఉదయం కురిసిన వర్షానికి, హైదరాబాద్​ మూసీ నది నుంచి వస్తున్న వరద కారణంగా భారీగా ప్రవహిస్తోంది. మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో సంగెం గ్రామ సమీపంలోని బ్రిడ్జికి ఇరు వైపులా వాహనాలను పోలీసులు నిలిపివేశారు.

Heavy Flood Water To Yadadri Musi River
Heavy Flood Water To Yadadri Musi River (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 11:34 AM IST

Updated : Sep 1, 2024, 1:24 PM IST

Heavy Flood Water To Yadadri Musi River : హైదరాబాద్ పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు 4 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 645.00 అడుగులు ఐతే ప్రస్తుత నీటిమట్టం 642.90 అడుగులు.

వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్దలో లెవల్ బ్రిడ్జిని తాకుతూ మూసీ నది ప్రవహిస్తోంది. మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో సంగెం గ్రామ సమీపంలోని బ్రిడ్జికి ఇరువైపులా వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో వలిగొండ మండలం సంగెం, భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామాలతో పాటు పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మరోవైపు జిల్లాలోని బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ ఉప్పొంగుతోంది. రుద్రవెల్లి గ్రామ సమీపంలోని లోలెవల్ వంతెనను తాకుతూ మూసి వరద ప్రవహిస్తుండటంతో బీబీనగర్, పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ పరిసరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మూసీ నదికి వరద పోటెత్తే అవకాశం ఉంది. ఈ రెండు గ్రామాల పరిధిలో లో లెవల్ బ్రిడ్జిల పైనుంచి ప్రయాణికులు దాటే సాహసం చేయవద్దని పోలీసులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇండ్లలోకి వరద నీరు : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లలోకి మోకాళ్ల లోతు నీళ్లతో బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. పట్టణంలోని షాబునగర్, తాళ్లగడ్డ, రవీంద్ర నగర్, గాంధీనగర్ లోతట్టు ప్రాంతాలలో ప్రధాన మురుగు కాలువ పొంగి ఇళ్లలోకి నీరు పోటెత్తుతుంది. రోడ్లన్నీ జలమయమయ్యి వాగులను తలపిస్తున్నాయి. తాళ్లగడ్డలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలోకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.

నీటి ఉద్ధృతికి కొట్టుకపోయిన రెండు కార్లు, ఆటోలు : మరోవైపు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వైష్ణవి పాఠశాల సమీపంలో గల వాగులో రెండు కార్లు, ఆటోలు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. వరద దాటికి డివైడర్లపై నుంచి వరద పారుతుంది. పలు డివైడర్లను పగులగొట్టి అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. అనంతగిరి రహదారి, మేళ్ల చెరువు రహదారులను పూర్తిగా బ్లాక్ చేశారు. కోదాడ పెద్ద చెరువు మత్తడి దూకడంతో నయనగర్ జల దిగ్బంధంగా మారింది. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోవడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మూసీకి వరదొచ్చింది - యాదాద్రిజిల్లాలో రాకపోకలకు బ్రేక్ పడింది - Heavy Flood To Yadadri Musi River

మూసీ నది ప్రక్షాళనలో ముందడుగు - ఎస్టీపీల నిర్మాణానికి రూ.3,849 కోట్లు మంజూరు - Musi River Cleaning Step Forward

Last Updated : Sep 1, 2024, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details