Harish Rao Open Letter To AICC Mallikarjun Kharge :మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష గురించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై రేవంత్ ఉపయోగిస్తున్న అసభ్యకరమైన భాష, నేరపూరిత వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తనే ప్రవచించిన ప్రమాణాలను పాటించకపోవడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
దిల్లీలో ఒక రూల్ - గల్లీలో ఒక రూల్ : రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై దూషణలు, కించపరచే వ్యాఖ్యలు చేయడం అతని దిగజారుడు తనానికి పరాకాష్ట అన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిందని రాజకీయాల్లో దిగజారుడు విమర్శలను తీవ్రంగా ఖండించిందన్న ఆయన రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం కాదా? అని ధ్వజమెత్తారు. దిల్లీలో ఒక రూల్ గల్లీలో ఒక రూల్ పాటించడం కాంగ్రెస్‌కే చెల్లుతుందని విమర్శలు గుప్పించారు.
రాష్ట్రం అప్పులపై సీఎం పదే పదే అబద్ధాలు చెబుతున్నారు : హరీశ్‌రావు - Harish Rao on CM Revanth
జర్నలిస్టులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి : రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమన్న ఆయన కాంగ్రెస్ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆ లేఖలో తెలిపారు. కాంగ్రెస్ తన నైతిక ప్రమాణాలను పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం శోచనీయంగా ఉందన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబంపై రేవంత్ రెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చడం కాదా అన్న ఆయన కేసీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్హై కమాండ్ సమర్ధిస్తుందా అని నిలదీశారు. హింసాత్మక వ్యాఖ్యలు చేయడం, జర్నలిస్టులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.