Gruha Jyothi Funds in Telangana Budget 2024 : రాష్ట్రంలో గృహాజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ.2,75,891 కోట్లుగా మంత్రి ప్రవేశపెట్టారు. గృహాజ్యోతి పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ప్రభుత్వం అందజేయనుంది. ఈ పథకానికి కేటాయించిన నిధులను అమలు చేసేందుకు సత్వర చర్యలు చేపడుతున్నామని భట్టి తెలిపారు. అసెంబ్లీ వేదకగా ఈ పథకం ఎప్పటి నుంచి అమలవుతోందనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించనున్నారు.
అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతుంది : ఈటల రాజేందర్
200 Units Free Electricity In Telangana :రేషన్‌కార్డు, ఆధార్(Aadhar), మొబైల్ నంబరు అనుసంధానమై కరెంటు కనెక్షన్లు ఉన్న ఇళ్లకు తొలిదశలో ‘గృహజ్యోతి’ కింద ఉచిత కరెంటు సరఫరా చేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంటుంది. దీనికి అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు సమాచారం. దీంతో మీటర్ రీడర్‌లు ఇంటింటికీ తిరిగి గృహ విద్యుత్ వినియోగదారుల వివరాలను అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలను మీటర్ రీడింగ్ మిషన్లలో నమోదు చేసుకుంటున్నారు. ఇటీవలె ‘ప్రజాపాలన’లో ఉచిత కరెంటు కోసం 81,54,158 మంది దరఖాస్తులు ప్రజల నుంచి వచ్చాయి. వీటిలో చాలా మంది రేషన్‌కార్డు, ఆధార్, సెల్‌ఫోన్ నంబర్లను సరిగా నమోదు చేసుకోలేదని తెలుస్తోంది. దీనికోసం విద్యుత్ సిబ్బంది ఈ వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారని తెలిపారు.