Group-1 Candidates Protest :గ్రూప్-1 పరీక్షలు రద్దుచేయాలంటూ అభ్యర్థులు ఇవాళ కూడా ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ గాంధీనగర్‌లోని పార్కుకు పెద్దఎత్తున తరలివచ్చిన అభ్యర్థులు ఈనెల 23నుంచి నిర్వహించే పరీక్షలు రద్దు చేయాలని కోరారు. జీవో నెంబర్ 29 రద్దుచేసి పాత పద్ధతిలోనే జీఓ నెంబర్ 55ను యధావిధిగా కొనసాగించాలని నినదించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకి తరలించారు. గ్రూప్-1పై ఉన్న కేసులన్నీ తొలగిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించకపోతే తాము తీవ్రఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు అన్నారు. మరికొందరు అభ్యర్థులు రాత్రి 9 గంటల సమయంలో అశోక్‌నగర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు.
Group1 Aspirants Meets Ex Minister KTR :మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులు ఇవాళ ఉదయం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిశారు. సమస్యలు వివరించిన అభ్యర్థులు మద్దతివ్వాలని కోరారు. కేసులు పరిష్కారం కాకుండా మెయిన్స్ నిర్వహిస్తే కొత్త చిక్కులు వస్తాయన్న అభ్యర్థులు వాటిని ప్రభుత్వం పట్టించుకోకుండా మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాకపోతే వేటిని చదవాలని ప్రశ్నించారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్‌ను కోరగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు. న్యాయపరంగా సాయం అందిస్తామని చెప్పారన్న అభ్యర్థులు అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలని పునరాలోచన చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు కోరారు.