తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారుల్లో 'హైడ్రా' వణుకు - ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు అప్పీల్​ - Hydra Case Filed On Govt Officials - HYDRA CASE FILED ON GOVT OFFICIALS

Hydra Cases Register On Govt Officers : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడుతూనే అనుమతులు ఇచ్చిన అధికారులపై కొరడా ఝుళిపించింది. ఈమేరకు పలువురు ప్రభుత్వ అధికారులపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి రంగనాథ్‌ ఫిర్యాదు చేశారు. కేసుల నమోదుతో పలువురు అధికారులు ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

Govt Officials Filed Bail Petition
Hydra Cases Register On Govt Officers (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 4:39 PM IST

Govt Officials Filed Anticipatory Bail Petition In Hydra Cases : హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతాల్లో చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారులపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ ఇటీవల ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా ఈ అక్రమ అనుమతుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. హైడ్రా ఫిర్యాదు మేరకు ఇవాళ అధికారులపై సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులు కేసులు నమోదు చేశారు. చందానగర్, బాచుపల్లిలోని గవర్నమెంట్​ ఉద్యోగులపై ఈమేరకు చర్యలు తీసుకున్నారు.

మరోవైపు కేసుల నమోదుతో ప్రభుత్వ అధికారులు తాజాగా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు అప్పీల్​ చేశారు. వీరిలో బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్, లాండ్‌ అండ్ రికార్డ్‌ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్‌ ముందస్తు బెయిల్‌కు పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. ఈక్రమంలో గవర్నమెంట్​ అధికారులకు బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టును ఆర్థిక విభాగం పోలీసులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details