Bachupally Wall Collapse Incident Update :హైదరాబాద్ బాచుపల్లి ఎల్లమ్మ కాలనీలో గోడకూలి ఏడుగురు మృతి చెందిన ఘటనను జీహెచ్‌ఎంసీ తీవ్రంగా పరిగణిస్తోంది. హైదరాబాద్‌లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను సర్వే చేసి నివేదిక ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ సీసీపీ, టౌస్ ప్లానింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కమిషనర్ వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సర్కిళ్ల వారీగా శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సెల్లార్లను గుర్తించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు, ప్రహరీలు, సెల్లార్ల తవ్వకంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిర్మాణదారులని హెచ్చరించాలని రొనాల్డ్ రాస్ సూచించారు. సర్కిళ్ల పరిధిలో ప్రమాదాలు జరగకుండా తీసుకున్న చర్యలు సహా శిథిలావస్థకు చేరిన నిర్మాణలపై ఈనెల 18 పూర్తినివేదిక అందించాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.
Six Arrested in Wall Collapse Case In Hyderabad :కాగా గోడ కూలిన ఘటనలో విచారణ జరుగుతోంది. అందుకు కారణమైన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి రేణుక ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. భవన నిర్మాణదారుడు అరవింద్‌రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీష్ సహా ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్, గుత్తేదారు రాజేష్, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
సడెన్‌గా కూలిన శ్మశానవాటిక గోడ- పక్కన కూర్చున్న ఐదుగురు మృతి- లైవ్ వీడియో - Wall Collapse In Gurgaon
అసలేం జరిగిందంటే ? రాజధానిలో నిన్న కురిసిన భారీ వర్షానికి బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న రైజ్ డెవలపర్స్ కన్‌స్ట్రక్షన్‌లో సెంట్రింగ్ పని చేస్తున్న కార్మికుల షెడ్‌పై ప్రహారీ గోడ కూలింది. ఘటనలో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు కూలీలు, ఓ మహిళ, నాలుగేళ్ల చిన్నారి ఉన్నట్లు గుర్తించారు.
GHMC Review on Wall Collapse in Hyderabad : ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది జేసీబీల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. మృత్యువాత పడిన కార్మికులు ఒడిషా, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.
బాచుపల్లిలో గోడకూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై సీఎం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కుండపోత వర్షం కారణంగా గోడ ఒక్కసారిగా గోడకూలినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుదని హామీ ఇచ్చారు. ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
రాష్ట్రంలో పలుచోట్ల గాలివాన బీభత్సం - పిడుగుపాటుకు ఇద్దరు మృతి - Heavy Rains Effect in Telangana
వర్షం నింపిన విషాదం - బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు దుర్మరణం - Wall Collapse in Hyderabad