Gas Leak in camphor industry:పరిశ్రమలో విషవాయువు విడుదలై ఐదుగురు కార్మికులు అస్వస్థకు గురైన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే శింగనమల మండలం లోలూరు క్రాస్ వద్ద ఉన్న కర్పూరం ప్రరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకొంది. పరిశ్రమలోని రియాక్టర్లను వెల్డింగ్ చేసేందుకు వెళ్లిన ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. విషవాయువును విడుదల చేసే యంత్రాన్ని శుభ్రం చేయడానికి వెళ్లిన కార్మికులు ఒక్కోక్కరుగా యంత్రంలోకి పడి పోయారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్షణరావు, కల్లూరుకి చెందిన కృష్ణ, ఓబిలేసు, ఒడిషా చెందిన సహారాయ్, తరిమెలకు చెందిన హరినాధ్బాబు, అనంతపురంకి చెందిన నాగేంద్ర ప్రసాద్, అస్వస్థతకు గురయ్యారు. వీరు ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నాగేంద్రప్రసాద్, లక్ష్మణరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు గత 3 రోజులుగా రియాక్టర్లకు వెల్డింగ్ చేస్తున్నారు.
ఆ తర్వాత రియాక్టర్ల్ను శుభ్రం చేయడానికి వెళ్లిన కార్మికులు అక్కడ విషవాయువు విడుదల అవుతుండటంతో ఆ వాయువును పీల్చుకొని అవస్థతకు గురయ్యారు. రియాక్టర్ నుంచి కార్బన్డేయాక్స్ యడ్ అధికంగా విడుదలైంది. ఆ సమయంలో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డారు. ఒక్కోక్కరు అక్కడే కుప్పకూలారు. ఆ తర్వాత ఓబిలేసు అనే కార్మికుడు ఐదుగురిని బయటకు తీసుకొచ్చినట్లు తెలిసింది.