TDP Leaders on Jagan in Gautam Adani Bribery Case : అదానీతో సోలార్ పవర్ ఒప్పందాల విషయమై సీఎం హోదాలో జగన్ అతి పెద్ద క్విడ్ ప్రోకోకు పాల్పడ్డాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణ ధ్వజమెత్తారు. జగన్ అవినీతి అక్రమాల చిట్టాలో అదానీతో సోలార్ పవర్ ఒప్పందాలు రెండో పెద్ద క్విడ్ ప్రోకో అని దుయ్యబట్టారు. జగన్ క్విడ్ ప్రోకో వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని మండిపడ్డారు. జగన్ అవినీతి వల్ల ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం పడిందని వాపోయారు. క్విడ్ ప్రోకో విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఏపీ ప్రభుత్వమైనా ఏసీబీ విచారణకు ఆదేశించాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై సెకీతోనే తప్ప, అదానీతో ఒప్పందాలే చేసుకోలేదని వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకీ అనేది కేవలం నోడల్ ఏజెన్సీ మాత్రమేనని, సెకీకి అదానీ కేసుతో ఎంత మాత్రమూ సంబంధం లేదని గుర్తు చేశారు. అదానీ-జగన్ డీల్ జరిగిందని స్పష్టంగా కన్పిస్తోందని యనమల అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా జగన్, అదానీ మధ్య ఒప్పందం జరిగిందని ఆక్షేపించారు.
అర్ధరాత్రి నిద్రలేపి సంతకం చేయమన్నారు : బాలినేని
జగన్ అదానీ ఏం మాట్లాడుతున్నారో తెలియాలి : అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడిన మొదటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దొంగ అనిపించుకున్న వ్యక్తి జగన్, మీడియాకు తెలియకుండా లేకుండా అదానీ, జగన్మోహన్ మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడుతున్నారో ప్రజలకు తెలియాలని అన్నారు. జగన్ విద్యుత్ చార్జీలు విషయంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికారంలో ఉన్నపుడు జగన్ మీడియా ముందుకు వచ్చి ఏ విషయం చెప్పలేదని, ఇప్పుడు ప్రతి విషయాన్ని మీడియా ముందుకు వచ్చి కథలు అల్లుతున్నారని తెలిపారు.
ఆంధ్ర రాష్ట్రానికి ట్రంప్ న్యాయం చేయాలని కోరారు. మూడు సార్లు అదానీని జగన్ ఎందుకు కలిశాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌పైన 16 సీబీఐ కేసులు ఉంటే ఇప్పటి వరకు కోర్టులకు హజరు కాలేదని, 60 మంది ఎంపీలు రాజ్యసభకు జగన్ అర్హుడు కాదని సంతకాలు పెట్టారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు చీప్ జస్టిస్ జగన్ కేసులపై విచారణ త్వరగా చేపట్టాలని కోరారు.
అదానీ కేసుల్లో జగన్ పాత్రపై అసెంబ్లీలో ప్రస్థావన - ఎవరెలా స్పందించారంటే!
జగన్ ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు - అదానీ ఒప్పందాలపై సమీక్షించాలి : షర్మిల