తెలంగాణ

telangana

ETV Bharat / state

తెల్ల రేషన్​ కార్డుదారులకు గుడ్​ న్యూస్ - కందిపప్పు కేజీ రూ.67 మాత్రమే!

తెల్ల రేషన్​ కార్డు ఉన్న ప్రతి ఒక్క కార్డు హోల్డర్​కు ఏపీ ప్రభుత్వం గుడ్​ న్యూస్ - నవంబరు నుంచి నాలుగు నిత్యావసర వస్తువులు - కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

White Ration Card Benefits
White Ration Card Benefits (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

White Ration Card Benefits in AP : తెల్లరేషన్​ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం గుడ్​న్యూస్ చెప్పింది. వచ్చే నెల నుంచి నాలుగు రకాల సరకులను చౌక ధరల దుకాణాల ద్వారా అందించనుంది. కార్డుదారులకు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఎంఎల్​ఎస్​ పాయింట్లకు కందిపప్పు చేరింది. ఈ పంపిణీని కచ్చితమైన తూకాలతో, నాణ్యమైన సరకు సరఫరా చేసే గుత్తేదారులకు మాత్రమే బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే అక్టోబరు నెలలో 50 శాతానికి పైగా కార్డుదారులకు కందిపప్పును పంపిణీ చేశారు. మరి నవంబరు నెలలో ప్రతి కుటుంబానికి నాలుగు వస్తువులు అందించేలా పౌర సరఫరాల సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చౌక ధరల దుకాణాలకు ఇప్పటికే రేషన్​ సరకులు జోరుగా చేరుతున్నాయి.

బియ్యానికి బదులు జొన్నలు :నవంబరులో కార్డుదారులకు నాలుగు రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నారు. ఇందులో బియ్యం బదులు జొన్నలు చౌకధరల దుకాణాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి కార్డుదారుడికి 3 కిలోల చొప్పున ఇవ్వనున్నారు. ఇందుకు నాణ్యమైన జొన్నలను డీలర్లకు అందించనున్నారు. కానీ 35 శాతానికిపైగా డీలర్లు జొన్నలు తీసుకెళ్లడం లేదని, డీలర్లు సరకులన్నింటినీ దుకాణాలకు తీసుకెళ్లేలా పౌరసరఫరాల అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదని విమర్శలు ఎన్నో ఉన్నాయి. నాణ్యమైన జొన్నలను డీలర్లకు సరఫరా చేస్తున్నారు. కానీ 35 శాతానికిపైగా డీలర్లు జొన్నలు తీసుకెళ్లడం లేదు. డీలర్లు సరకులన్నింటినీ దుకాణాలకు తీసుకెళ్లేలా పౌరసరఫరాల అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

కిలో కందిపప్పు రూ.67 మాత్రమే : నవంబరు నుంచి కిలో కందిపప్పు రూ.67 అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 12.18 లక్షల మంది కార్డుదారులు ఉండగా, 9.85 లక్షల మందికి కందిపప్పు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఇక డీలర్లు డీడీలు చెల్లించి సరకు తీసుకెళ్లాల్సి ఉంది. పంచదార ఏఏవై కార్డుదారులకు కిలో రూ.14లకు ఇవ్వగా, మిగిలిన కార్డుదారులకు అర కిలో రూ.17 చొప్పున అందించనున్నారు.

పేదలకు పప్పన్నం దూరం చేసిన వైఎస్సార్​సీపీ :బహిరంగ మార్కెట్​లో పప్పుధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పేదలకు కందిపప్పు అందించేలా చర్యలు తీసుకోవాల్సి ఉండగా గత ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో పేదలకు పప్పన్నం దూరం చేసింది. కిలో కందిపప్పు రూ.160-180 వరకు పలుకుతోంది. దీంతో పేదలు తినే పరిస్థితి కనిపించడం లేదు.

ఇప్పుడిక 'బియ్యం' వంతు.. కొనలేం.. తినలేం..

kitchen Budget Increased వంటింట్లో ధరల మంట సగటున నెలకు రూ.2000 పైనే

ABOUT THE AUTHOR

...view details