Former MLA Shakeel's Son Rahil Granted Conditional Bail : హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో ఇటీవల అరెస్టై, ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉంటున్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహుల్‌కు నాంపల్లి కోర్టులో ఊరట దక్కింది. బెయిల్ కోరుతూ అతడి తరఫు న్యాయవాదులు ఈ నెల 8న దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం, రాహిల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేలు, 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పాటించాలని అతడికి సూచించింది. అదే సమయంలో రాహుల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల కస్టడీని కోర్టు కొట్టివేసింది.
గతేడాది డిసెంబర్‌లో ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాహిల్‌ను ఈ నెల 8న పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం తర్వాత దుబాయ్ పారిపోయిన అతడు, సోమవారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రాగానే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం అతడికి ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో మరో ట్విస్ట్ - అదుపులోకి బోధన్ సీఐతో పాటు మరో వ్యక్తి
అయితే రాహిల్‌ను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సాహిల్ సైతం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్న న్యాయమూర్తి, తీర్పును నేటికి వాయిదా వేశారు. నేడు కస్టడీ పిటిషన్‌ను కొట్టివేస్తూ, రాహుల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
ఒక్కడిని తప్పించబోయి 15 మంది కటకటాల్లోకి : రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత నోటీసులతో వదిలిపెట్టే కేసు కాస్తా నిందితుడు తన తండ్రి పలుకుబడితో బయటపడేందుకు చేసిన ప్రయత్నంతో ఇంత దాకా వచ్చింది. ఇద్దరు సీఐలు సహా 15 మందిని కటకటాల్లోకి నెట్టింది. వివరాల్లోకి వెళితే, డిసెంబరు 23న అర్ధరాత్రి ప్రజా భవన్ వద్ద రాహిల్ తన కారుతో ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టాడు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు కారు డ్రైవ్ చేస్తున్న రాహిల్‌ను గుర్తించి, అతడితో పాటు కారులో ఉన్న మరో ముగ్గురు యువతులను పంజాగుట్ట స్టేషన్‌లో అప్పగించారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసు - పంజాగుట్ట మాజీ సీఐ అరెస్ట్
అయితే పోలీస్ స్టేషన్‌లో ఉన్న రాహిల్ తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దాంతో ఆయన తన సమీప బంధువులు, బోధన్ సీఐ ప్రేమ్ కుమార్, పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావుతో మాట్లాడి రాహిల్‌ను ఠాణా నుంచి తప్పించారు. తెల్లారాక అతడి స్థానంలో మరొకర్ని ఉంచారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయగా షకీల్, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, మరో 12 మంది పాత్ర నిర్ధారణ అయ్యింది. ఇలా రాహిల్ ఒక్కరితో ఆగిపోవాల్సిన కేసు, ఎన్నో మలుపులు తిరిగి మరో 15 మంది మెడకు చుట్టుకుంది.
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌కు హైకోర్టులో ఊరట- లుక్ అవుట్ నోటీసులు సస్పెండ్