Former Minister Narsa Reddy Passed Away : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత పి.నర్సారెడ్డి ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. నర్సారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంతాపం ప్రకటించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రజలకు అనేక సేవలందించారని కొనియాడారు. మంత్రిగా నర్సారెడ్డి చేసిన సేవలు మరువలేనివని, ఆయన అనుభవాలు తమకు మార్గదర్శకమని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. అనంతరం నర్సారెడ్డి భౌతికకాయానికి సీఎం నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
EX PCC Narsa Reddy passes Away : ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka), మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు, పోన్నం ప్రభాకర్ ఇతర నేతలు కూడా నర్సారెడ్డి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి, పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 1972లో నర్సారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. జలగం వెంగళరావు ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన స్వస్థలం నిర్మల్ జిల్లా మలక్‌చించోలీ గ్రామం.