Ex Minister Harish rao Slams Congress :కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు మరోమారు బయటపడ్డాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్ రావు ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పూర్తిగా విఫలమైందని, ప్రైవేట్ బీమా కంపెనీలకు లబ్ది చేకూర్చడానికే దాన్ని వాడుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ట్వీట్ చేశారు.
అప్పుడు చిటికేస్తే ఉద్యోగాలన్నారు - ఇప్పుడు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు : హరీశ్ రావు - HARISH RAO ON JOB CALENDER
కానీ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అదే పథకానికి రెడ్ కార్పెట్ పరిచి అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన ఆక్షేపించారు. అదేవిధంగా అదానీకి బీజేపీ దోచిపెడుతుందని రాహుల్ గాంధీ అంటే, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదానీతో రూ.వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంటోందని అన్నారు. ఏది వాస్తవమో కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలన్న హరీశ్ రావు, దిల్లీ కాంగ్రెస్ చెబుతున్నది నిజమా, తెలంగాణ కాంగ్రెస్ చెబుతున్నది నిజమా? అని అడిగారు.
రైతులకు వడ్డీల మోత :రాష్ట్రంలో రుణమాఫీ అమలుపై రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హరీశ్‌రావు ట్వీట్ చేశారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు.
ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు కానీ వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోందని రైతులు బాధపడుతున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామనీ, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్‌ను, రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారని, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఎక్స్‌లో వెల్లడించారు.
రేషన్‌కార్డులు ఉన్నవారికే రుణమాఫీ చేయడం సరికాదు - షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి: హరీశ్ రావు - Farmer Loan Waiver
నెలకు రూ.2500 సాయం కోసం కోటి మంది మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు : హరీశ్‌రావు - Harish Rao Reaction on Budget 2024