Former Minister Vidadala Rajini Illegal Corruptions in AP:ఏపీలోనిపల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో సేకరించిన భూములలో అప్పటి మంత్రి విడదల రజిని అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరా రూ.12 లక్షలు పలుకుతోంది. ఐతే జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇస్తే ఎకరాకు రూ.31 లక్షలు ఇప్పిస్తానంటూ అప్పటి మంత్రి రజిని రైతులకు ఎరేశారు. ఐతే అందులో కొంత కమిషన్ కోరుకున్నారు. మధ్యవర్తులుగా కొందరిని పంపారు.
మొదటి రెండు విడతల్లో 50 ఎకరాలు సేకరించగా ఎకరాకు రూ.2 లక్షల చొప్పున మొత్తం 1.16 కోట్ల రైతుల నుంచి వసూలు చేశారు. మూడు, నాలుగు విడతల్లో 100 ఎకరాల వరకు సేకరించారు. అందులో ఎకరాకు ఏడున్నర లక్షలు చొప్పున ఏడున్నర కోట్లు ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు, నోట్లు తీసుకున్నారు.
పులివెందులలో బ్యాలెట్ ఓటింగ్‌కు సిద్ధమా?- జగన్ వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ - TDP Leaders fires On Jagan
ఈ విషయంపై అప్పట్లో ఈనాడు కథనం ప్రచురించడం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహించడంతో రైతుల వద్ద తీసుకున్న చెక్కులు, నోట్లు తిరిగి ఇచ్చేశారు. అయితే ఈ వ్యవహారంలో అప్పట్లో మధ్యవర్తిగా ఉన్న అప్పటి వైఎస్సార్సీపీ, ప్రస్తుత టీడీపీ నాయకుడు మల్లెల రాజేష్ నాయుడు ముందుగానే రజినీకి రూ.5 కోట్లు చెల్లించాడు. పసుమర్రు శివారులోని గుదేవారిపాలెం గ్రామ పరిధిలో మరో పదెకరాలు సేకరించగా దానికి నాదెండ్ల మండలం వైఎస్సార్సీపీ జడ్పీటీసీ మస్తాన్‌రావు మధ్యవర్తిగా కోటి రూపాయలు వసూలు చేసి రజినీకి ఇచ్చాడు.
పసుమర్రుకు చెందిన రైతులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీని కూడా కలిశారు. విచారణ జరిగితే గుట్టు రట్టవుతుందని భావించిన రజనీ మనుషులు మొదట తీసుకున్న 1.16 కోట్లను తిరిగి ఇచ్చేశారు. గుదేవారిపాలెం రైతులు కూడా తమ వద్ద తీసుకున్న కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రజనీ ముఠా బాధితులు మరికొందరు బయటికొస్తున్నారు. తమ వద్ద రూ.2.30 కోట్ల వరకూ వసూలు చేశారంటూ బోయపాలెంలోని స్టోన్ క్రషర్ల యాజమాన్యాల కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
దొంగే - దొంగా దొంగ అన్నట్లుగా వైసీపీ నేతల తీరు : రఘురామ కృష్ణంరాజు - Raghu Rama Krishna Raju Fire on YCP
ఎన్నికల ప్రక్రియపై ఏపీ మాజీ సీఎం జగన్ ట్వీట్ - టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్! - AP EX CM Jagan Tweet on EVMS