తెలంగాణ

telangana

ETV Bharat / state

కులగణన పేరుతో ఊళ్లల్లో అలజడి సృష్టించొద్దు : మాజీ సీఎం - FORMER AP CM NADENDLA BHASKAR RAO

గ్రామాల్లో ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెడిపోతుందని వ్యాఖ్య - మూసీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి అవసరం - ప్రభుత్వానికి సూచించిన మాజీ సీఎం నాదెండ్ల

CAST CENSUS ISSUE IN TG
FORMER AP CM NADENDLA BHASKAR RAO (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2024, 12:29 PM IST

Former CM on Caste Census : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన పేరుతో గ్రామాల్లో అలజడి సృష్టించవద్దని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్​ రావు కోరారు. కులాల సేకరణకు ఇతర విధానాలు కూడా ఉన్నాయన్నారు. కుల గణన పేరుతో గ్రామాల్లోకి వెళ్తే ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న కుల గణనపై హైదరాబాద్​లోని తన నివాసంలో నాదెండ్ల తన అభిప్రాయాలను మీడియాకు తెలిపారు. కులగణన పేరుతో ప్రభుత్వం ఏం చేయబోతుందో స్పష్టంగా ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.

ఇప్పటికే సుప్రీం కోర్టు 50 శాతం రిజర్వేషన్లపై ఆదేశాలు ఇచ్చిన తర్వాత మళ్లీ కొత్తగా కులగణన చేయడంలో ఆంతర్యం ఏముందని ఆయన ప్రభుత్వాన్ని అడిగారు. పట్టణాల ప్రజలలో కుల ప్రస్థావన పెద్దగా పరిగణలోకి తీసుకోరని వెల్లడించారు. పల్లెల్లో మాత్రం కుల వ్యవస్థ ఇంకా బలంగానే ఉందని, ఈ సున్నితమైన అంశంపై ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని నాదెండ్ల హితవు పలికారు. అలాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పాలన అందించేందుకు గట్టిగానే ఆరాట పడుతున్నాడని తెలిపారు. ఈ క్రమంలో చేపట్టిన మూసీ పునరుజ్జీవనం కార్యక్రమాన్ని స్వాగతించారు. తప్పకుండా మూసీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details