తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్తీనీటిని ప్రముఖ బ్రాండ్ల పేరుతో తయారు చేసి విక్రయం - ఎట్టకేలకు అధికారుల దాడులతో బట్టబయలు - ILLEGAL DRINKING WATER BUSINESS

మీరు కొన్న నీళ్లు సు'రక్షిత'మేనా ఓ సారి చెక్​ చేసుకోండి - కల్తీనీటిని ప్రముఖ బ్రాండ్ల పేరుతో గత కొన్నేళ్లుగా విక్రయం - దాడులు నిర్వహించి వాటర్​ ప్లాంట్​ను సీజ్​ చేసిన అధికారులు

Illegal Packaged Drinking Water
Illegal Packaged Drinking Water (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2024, 9:51 PM IST

Illegal Packaged Drinking Water :నగరంలోని అంబర్​పేట నియోజకవర్గం పరిధిలోని నింబోలి అడ్డా హర్రాస్​పెంటలో కల్తీ నీటిని ప్రముఖ బ్రాండ్ల పేరుతో తయారు చేసి గత కొన్ని ఏళ్లుగా విక్రయించారు. ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తయారుచేసిన ఈ నీటిని నగరవ్యాప్తంగా పలుచోట్ల సరఫరా చేశారు. కొన్నేళ్లుగా బహిరంగంగా సాగిన ఈ అక్రమ నీటి దందాతో రూ. లక్షలు దండుకున్నారు. డబ్బులు పెట్టి ఈ వాటర్​ బాటిళ్లను కొనుగోలు చేసిన నగర వాసులు ఏళ్లుగా వినియోగించారు. ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితం జీహెచ్ఎంసీ అంబర్​పేట సర్కిల్ ఆహార భద్రత తనిఖీ(ఫుడ్​ సేఫ్టీ విభాగం), తూర్పు మండలం టాస్క్​ఫోర్స్​ పోలీసులు అక్రమ నీటి విక్రయాలను బయటపెట్టారు.

ఏకంగా ప్లాంట్ ఏర్పాటు :హర్రాస్​పెంట​లో ఓ స్థలాన్ని లీజుకు తీసుకుని కొంతకాలం పాటు వినియోగించిన (సెకండ్ హ్యాండ్) కార్లను విక్రయించారు. ఆ తర్వాత అక్రమ నీటి వ్యాపారంపై దృష్టి మళ్లించారు. షెడ్డును స్థానికంగా ఏర్పాటు చేసి దానిలోపల మినరల్ వాటర్​ను తయారు చేసేందుకు ఏకంగా ప్రముఖ బ్రాండ్లను పోలిన తాగునీటి సీసాలు ప్లాంటు సైతం నెలకొల్పారు. ఈ ప్లాంటు ఏర్పాటుకు ఐపీఎం నుంచి విధిగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటిదేమి చేయకుండానే నీటి విక్రయాలను ప్రారంభించారు.

మార్కెట్లో ప్రస్తుతం అమ్మతున్న ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లను పోలిన సీసాల్లో ఈ వాటర్​ను నింపి నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్లు, లాడ్జీలు తదితర వాటికి సరఫరా చేశారు. వారు ప్రజలకు లీటర్ బాటిల్​ను రూ.15-20 చొప్పున విక్రయించి సొమ్ము చేసు కునే వారు. కొన్నేళ్ల పాటు ఈ అక్రమ నీటి వ్యాపారం నిరాటంకంగానే సాగింది.

ఎట్టకేలకు బట్టబయలు :అక్రమ కల్తీనీటి వాటిర్​బాటిల్స్​ తయారీపై అందిన సమాచారం మేరకు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ, తూర్పు మండలం టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడి జరిపారు. ఈ క్రమంలో ప్రముఖ బ్రాండ్లను పోలిన మినరల్ బాటిళ్లు అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకు న్నారు. కల్తీ నీటిలో 75కు మించి టోటల్ డిసాల్ట్ సాలిడ్స్(టీడీఎస్) ఉండాల్సి ఉండగా కేవలం 18 మాత్రమే ఉండటాన్ని పరీక్షలో అధికారులు గుర్తించారు. అనంతరం నీటి తయారీ వాటర్​ ప్లాంటుకు తాళం వేసి సీజ్ చేశారు.

చిక్కదనంతో పాటు తక్కువ ధర అని కొంటున్నారా? - ఆ బ్రాండ్ల పాలు కల్తీవట! - జర చూస్కోండి

అలర్ట్ : మీరు తాగే పాలలో సబ్బు నీళ్లు, యూరియా గుళికలు! - కల్తీని ఇలా ఈజీగా కనిపెట్టండి

ABOUT THE AUTHOR

...view details