Food Safety Officials Raids in Bakery in Secunderabad : గత సంవత్సరం నుంచి హైదరాబాద్ నగరంలో ఆహార భద్రత అధికారులు హోటళ్లు, రెస్టారెంట్, బేకరీలలో తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో దారుణమైన విషయాలు బయట పడుతున్నాయి. అక్కడ ఉంటే ఆహార పదార్ధాలను చూసి అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిర్వాహకులు కాసుల కోసం కక్కుర్తి పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి అపరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేసిన ఆహార పదార్థాలపై వినియోగదారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన ఆహారం విషయంలో అవగాహన అవసరమని తాజా ఘటనలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు, ఇక్కడ కేకులు తింటే హాస్పిటల్‌కు వెళ్లడం గ్యారెంటీ! (ETV Bharat) Food Adulteration in Bakery :రాష్ట్రంలో ఆహార కల్తీని నివారించేందుకు గత సంవత్సరం సెప్టెంబరులో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లతో 2 టాస్క్‌ఫోర్స్ బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒకటి జీహెచ్‌ఎంసీ పరిధిలో, మరొకటి జిల్లాల్లో. ఈ రెండు బృందాలు తరచూ తనిఖీలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని ఓ బేకరీలో ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేపట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
బేకరీకి నోటీసులు జారీ :సికింద్రాబాద్‌లోని మచ్చ బొల్లారం మోంగినిస్ బేకరీలో ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు. బేకరీలో కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నాయి. మొత్తం కిచెన్ అపరిశుభ్రంగా కనిపించింది. తనిఖీల్లో కాలం చెల్లిన కోకో పౌడర్, కేసర్ సిరప్, వెనీలా ఫ్లేవర్ సిరప్, పైన్ యాపిల్ సిరప్లు అధికారులు సీజ్ చేశారు. అపరిశుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్‌లు, ప్లాస్టిక్ డ్రమ్స్లోనే కేక్‌లు తయారు చేస్తున్నట్లు, తయారీ కోసం వినియోగించే పాత్రలు సైతం అపరిశుభ్రంగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చాయి. అలాగే కేక్‌ల తయారీలో వివిధ కెమికల్స్ కూడా ఉపయోగిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పరిశీలించిన ఆహార భద్రత అధికారులు మోంగినిస్ బేకరీకి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు మచ్చ బొల్లారం మోంగినిస్ బేకరీలో కేకులు, ఇతర తినుబండారాలు కొనుగోలు చేసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఎక్కువగా బయటి ఫుడ్ తింటున్నారా? - అయితే ఇవి తెలుసుకోండి
యాసిడ్‌తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ - ఇది చూస్తే ఇంకెప్పుడూ బయట కొనరు