Fire Accident in Warangal District : రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. వేసవి సమీపిస్తుండటంతో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. పౌరులు అప్రమత్తంగా లేని సమయంలో ప్రమాదాలు సంభవించి ఆస్తులు బూడిదవుతుంటాయి. తాజాగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో షార్ట్ సర్క్యూట్‌తో రెండు ఇండ్లు దగ్ధమయ్యాయి.
Warangal Fire Accident Today :ఈ ప్రమాదంలో మూడు కుటుంబాలకు చెందిన ఇళ్లు పూర్తిగా కాలిపోగా ఆస్తి నష్టం వాటిల్లింది. ధరావత్ ధర్మ, విజ్య, శ్రీనివాస్ కుటంబ సభ్యులు ఇంట్లోకి మంటలు రావడం గమనించి పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. చుట్టుపక్కలకు మంటలు వ్యాపించడంతో పక్కనే ఉన్న గడ్డివాము సైతం మంటలో కాలి బూడిదైంది.
చుట్టు పక్కలా వారి సహాయంతో మంటలను (Fire Accident) ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటల కారణంగా ఇంట్లోని సామాన్లు సహా నిత్యవసర వస్తువులు కాలిపోయాయని బాధితులు వాపోయారు. అధికారులు స్పందించి తమకు సహాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- ఏడుగురు దుర్మరణం- మరో ఏడుగురు సీరియస్!
Burned Bike in Shadnagar :మరో ఘటనలో ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నుంచి ఓ వ్యక్తి హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తున్నాడు. సరిగ్గా భారత్ పెట్రోల్ పంపు వద్దకు రాగానే అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. గమనించిన వాహన చోదకుడు ద్విచక్రవాహనంపై నుంచి దిగడంతో తృటిలో ప్రమాదం తప్పింది. మంటల్లో బైక్ పూర్తిగా దగ్ధమైంది. దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న షాద్‌నగర్‌అగ్నిమాపక సిబ్బందిఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.