LIVE FEED
7:17 PM, 13 Dec 2024 (IST)
- కాసేపట్లో చంచల్‌గూడ జైలు నుంచి బయటకు రానున్న అల్లు అర్జున్
- మధ్యంతర బెయిల్ పత్రాలు జైలు సిబ్బందికి అందజేసిన లాయర్లు
- చంచల్‌గూడ జైలు వద్ద భారీగా చేరుకున్న అల్లు అర్జున్ అభిమానులు
6:15 PM, 13 Dec 2024 (IST)
మధ్యంతర బెయిల్ రావడంతో అల్లు అర్జున్‌కు ఊరట
- అల్లు అర్జున్ అరెస్టు విషయంలో ఉదయం నుంచీ నాటకీయ పరిణామాలు
- ఉదయం తన నివాసంలో అల్లు అర్జున్ను అరెస్టు చేసిన పోలీసులు
- సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టు
- అల్లు అర్జున్ను అరెస్టు చేసి చిక్కడపల్లి పీఎస్‌కు తరలించిన పోలీసులు
- చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు
- చిక్కడపల్లి పీఎస్ నుంచి వైద్యపరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలింపు
- వైద్యపరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
- అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
- అల్లు అర్జున్ను చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు
- హైకోర్టులో మధ్యంతర బెయిల్ రావడంతో అల్లు అర్జున్‌కు ఊరట
6:00 PM, 13 Dec 2024 (IST)
క్వాష్ పిటిషన్‌పై విచారణ 2 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు
- అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్
- అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు
- అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు
- క్వాష్ పిటిషన్‌పై విచారణ 2 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు
- సుదీర్ఘ వాదనల తర్వాత అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్
- సొంత పూచీకత్తు సమర్పించాలని అల్లు అర్జున్‌కు హైకోర్టు ఆదేశం
- అర్నబ్ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పు ఆధారంగా హైకోర్టు ఉత్తర్వులు
- రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలన్న హైకోర్టు
- అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌పై అభ్యంతరం చెప్పిన పీపీ
- క్వాష్ పిటిషన్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై పీపీ అభ్యంతరం
- సంధ్య థియేటర్ యాజమాన్యానికి కూడా ఊరట
5:50 PM, 13 Dec 2024 (IST)
- అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్
- అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు
- అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు
- సుదీర్ఘ వాదనల తర్వాత అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్
- పూర్తిస్థాయి బెయిల్‌కు నాంపల్లి కోర్టుకు వెళ్లాలన్న హైకోర్టు
- అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌పై అభ్యంతరం చెప్పిన పీపీ
- క్వాష్ పిటిషన్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై పీపీ అభ్యంతరం
5:39 PM, 13 Dec 2024 (IST)
- అల్లు అర్జున్‌కు హైకోర్టులో మధ్యంతర బెయిల్
- .మద్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు
5:35 PM, 13 Dec 2024 (IST)
చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్
- హైదరాబాద్: చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్
- అల్లు అర్జున్ను చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు
- చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు
- జైలు వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన సౌత్ఈస్ట్ జోన్ పోలీసులు
5:17 PM, 13 Dec 2024 (IST)
అల్లు అర్జున్ను ఏ-11గా రిమాండ్ నివేదికలో పేర్కొన్న పోలీసులు
- అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు
- అల్లు అర్జున్ను ఏ-11గా రిమాండ్ నివేదికలో పేర్కొన్న పోలీసులు
- అల్లు అర్జున్ను మధ్యాహ్నం 1.30కు అరెస్టు చేసినట్లు రిమాండ్ నివేదికలో వెల్లడి
- అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణ అత్యవసం కాదన్న పీపీ
- అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌ను సోమవారం విచారించాలన్న పీపీ
- అల్లు అర్జున్ అరెస్టు కావడంతో బెయిల్ కోసం మరో పిటిషన్ వేసుకోవాలన్న పీపీ
- క్వాష్ పిటిషన్లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న అల్లు అర్జున్ తరఫు న్యాయవాది
- అల్లు అర్జున్ తన సినిమా విడుదల రోజు థియేటర్‌కు వెళ్తారు: నిరంజన్‌రెడ్డి
- థియేటర్ యాజమాన్యం, నిర్మాత, పోలీసులకు సమాచారం ఇచ్చారు: నిరంజన్‌రెడ్డి
- అల్లు అర్జున్ సంధ్య థియేటర్ మొదటి అంతస్తులో కూర్చున్నారు: నిరంజన్‌రెడ్డి
- తొక్కిసలాటలో మరణించిన మహిళ థియేటర్లో కింద ఉన్నారు: నిరంజన్‌రెడ్డి
- అల్లు అర్జున్ అరెస్టు వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే: నిరంజన్‌రెడ్డి
- అల్లు అర్జున్ను అరెస్టు చేసినందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వాదనలు
- బండి సంజయ్ అరెస్టయినప్పుడు రిమాండ్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది: నిరంజన్‌రెడ్డి
- 'రేస్' ప్రమోషన్ ఘటన కేసును గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది: నిరంజన్‌రెడ్డి
5:05 PM, 13 Dec 2024 (IST)
అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్
- అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్
- అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
- నాంపల్లి కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్ తరలింపు
- సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు రిమాండ్
4:55 PM, 13 Dec 2024 (IST)
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు
- వాదనలు వినిపిస్తున్న అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి
- సంబంధం లేని కేసులను పోలీసులు నమోదు చేశారన్న నిరంజన్‌రెడ్డి
- ఇలాంటి కేసులను గతంలో అహ్మదాబాద్ హైకోర్టు కొట్టేసిందన్న నిరంజన్‌రెడ్డి
- అప్పీల్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసిందన్న అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి
4:23 PM, 13 Dec 2024 (IST)
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు
- అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు
- పోలీసులు తప్పుడు సెక్షన్లు నమోదు చేశారు: సంధ్య థియేటర్ న్యాయవాది
- ప్రీమియర్ షో గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాం: సంధ్య థియేటర్ న్యాయవాది
- 2 రోజులు ముందే పోలీసులకు సమాచారం ఇచ్చాం: సంధ్య థియేటర్ న్యాయవాది
- అల్లు అర్జున్ థియేటర్‌కు ర్యాలీగా వచ్చారని కోర్టుకు తెలిపిన పోలీసులు
4:09 PM, 13 Dec 2024 (IST)
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం
- అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం
- తనపై నమోదైన కేసు కొట్టేయాలని అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్
4:01 PM, 13 Dec 2024 (IST)
నాంపల్లి కోర్టుకు వచ్చిన పుష్ప సినిమా నిర్మాతలు నవీన్, రవిశంకర్
- నాంపల్లి కోర్టుకు వచ్చిన పుష్ప సినిమా నిర్మాతలు నవీన్, రవిశంకర్
3:56 PM, 13 Dec 2024 (IST)
- నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ను హాజరుపరిచిన పోలీసులు
- 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు
- కోర్టు హాల్లో జనం ఎక్కువగా ఉండడంతో జడ్జి ఛాంబర్‌కు తరలింపు
- కాసేపట్లో హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణ
- హైకోర్టు తీర్పు వచ్చాకే నాంపల్లి కోర్టు రిమాండ్‌పై స్పష్టత వచ్చే అవకాశం
3:51 PM, 13 Dec 2024 (IST)
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ
- అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ
- పోలీసుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తామన్న పీపీ
- విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
- అరెస్టు చేసిన విధానం, పోలీసుల తీరుపైనా విచారణ జరుపుతామన్న హైకోర్టు
3:48 PM, 13 Dec 2024 (IST)
నాంపల్లి కోర్టుకు చేరుకున్న నిర్మాతలు బన్నీ వాసు, నాగ వంశీ,
- నాంపల్లి కోర్టుకు చేరుకున్న నిర్మాతలు బన్నీ వాసు, నాగ వంశీ, ఎస్కేఎన్
- నాంపల్లి కోర్టుకు చేరుకున్న పలువురు సినీ ప్రముఖులు, అల్లు అర్జున్ సన్నిహితులు
3:47 PM, 13 Dec 2024 (IST)
చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు
- హైదరాబాద్: చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు
- బందోబస్తు ఏర్పాటు చేసిన సౌత్ఈస్ట్ జోన్ పోలీసులు
3:41 PM, 13 Dec 2024 (IST)
అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: హరీశ్‌రావు
- అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: హరీశ్‌రావు
- అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?: హరీశ్‌రావు
- తొక్కిసలాట ఘటనకు అసలు కారకులు రాష్ట్ర పాలకులే: హరీశ్‌రావు
- చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే: హరీశ్‌రావు
3:36 PM, 13 Dec 2024 (IST)
అల్లు అర్జున్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన పోలీసులు
- గాంధీ ఆస్పత్రి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు
- అల్లు అర్జున్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన పోలీసులు
3:07 PM, 13 Dec 2024 (IST)
గాంధీ ఆస్పత్రి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు
- అల్లు అర్జున్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి
- గాంధీ ఆస్పత్రి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు
- గాంధీ ఆసుపత్రి వద్ద అభిమానులను చూసి అభివాదం చేసిన అల్లు అర్జున్
2:56 PM, 13 Dec 2024 (IST)
అల్లు అర్జున్ అరెస్టు తీరు సరికాదు: బండి సంజయ్
- అల్లు అర్జున్ అరెస్టు తీరు సరికాదు: బండి సంజయ్
- నేరుగా బెడ్రూమ్కు వచ్చి అరెస్టు చేస్తారా?: బండి సంజయ్
- బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా అరెస్టు చేస్తారా?: బండి సంజయ్
- అల్లు అర్జున్ భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు: బండి సంజయ్
- తొక్కిసలాట ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం: బండి సంజయ్
- అల్లు అర్జున్‌కు గౌరవం ఇవ్వాలి.. నేరస్తుడిగా చూడొద్దు: బండి సంజయ్
2:46 PM, 13 Dec 2024 (IST)
అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడు కాదు: రాజాసింగ్
- తొక్కిసలాట ఘటన ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగింది: రాజాసింగ్
- తొక్కిసలాట ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణం: రాజాసింగ్
- అల్లు అర్జున్ను నేరస్తుడిగా చూడటం సరికాదు: రాజాసింగ్
- అర్జున్ జాతీయ అవార్డు సాధించి తెలుగువారి ప్రతిష్ఠ పెంచారు: రాజాసింగ్
2:46 PM, 13 Dec 2024 (IST)
అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి దంపతులు
- అల్లు అర్జున్ నివాసానికి వచ్చిన చిరంజీవి దంపతులు
2:46 PM, 13 Dec 2024 (IST)
అల్లు అర్జున్ పిటిషన్‌పై విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా
- అల్లు అర్జున్ పిటిషన్‌పై విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా
- పోలీసుల నుంచి పూర్తి వివరాలు సేకరించి 4 గంటలకు చెబుతానన్న పీపీ
- విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
2:45 PM, 13 Dec 2024 (IST)
కాసేపట్లో అల్లు అర్జున్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
- కాసేపట్లో అల్లు అర్జున్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
- అత్యవసర పిటిషన్‌గా విచారించాలని హైకోర్టును కోరిన న్యాయవాది
2:29 PM, 13 Dec 2024 (IST)
గాంధీ ఆసుపత్రికి చేరుకున్న హీరో అల్లు అర్జున్
- అల్లు అర్జున్ అరెస్టు, గాంధీ ఆస్పత్రికి తరలింపు
- చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు
- ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అల్లు అర్జున్ను విచారించిన పోలీసులు
- సుమారు రెండు గంటలపాటు అల్లు అర్జున్ను విచారించిన పోలీసులు
- చిక్కడపల్లి పీఎస్ నుంచి గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్ తరలింపు
- గాంధీ ఆస్పత్రిలో వైద్యపరీక్షల తర్వాత నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
- అల్లు అర్జున్ అరెస్టు అంశంలో చట్టప్రకారం ఫాలో అవుతున్నామన్న పోలీసులు
- సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ నేతృత్వంలో అల్లు అర్జున్ విచారణ
- ఉదయం అల్లు అర్జున్ను తన ఇంట్లోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు
2:28 PM, 13 Dec 2024 (IST)
- చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకుంటున్న పలువురు సినీ ప్రముఖులు
- చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన నిర్మాత దిల్ రాజు
- చిక్కడపల్లి పీఎస్‌కు భారీగా తరలివస్తున్న అల్లు అర్జున్ అభిమానులు
2:27 PM, 13 Dec 2024 (IST)
- అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణ కోసం ఆయన న్యాయవాది యత్నాలు
- అత్యవసర పిటిషన్‌గా విచారించాలని హైకోర్టును కోరిన అల్లు అర్జున్ న్యాయవాది
- బుధవారం పిటిషన్ వేశామని కోర్టు దృష్టికి తీసుకువచ్చిన న్యాయవాది
- అత్యవసర పిటిషన్‌ను ఉ.10.30కే మెన్షన్ చేయాలి కదా అని ప్రశ్నించిన కోర్టు
- క్వాష్ పిటిషన్‌పై పోలీసుల దృష్టికీ తెచ్చామన్న అల్లు అర్జున్ లాయర్ నిరంజన్‌రెడ్డి
- పిటిషన్‌ను సోమవారం విచారిస్తామన్న హైకోర్టు
- పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలన్న పిటిషనర్
- మ.1.30 గం.కు లంచ్ మోషన్ పిటిషన్ విచారణ కోరడం సరికాదన్న పీపీ
- సోమవారం వరకు చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలన్న పిటిషనర్
- పోలీసుల నుంచి వివరాలు సేకరించాక కోర్టుకు సమాచారం ఇస్తామన్న పీపీ
2:26 PM, 13 Dec 2024 (IST)
పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్ అసంతృప్తి
- పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్ అసంతృప్తి
- నన్ను తీసుకెళ్లడంలో తప్పు లేదు: అల్లు అర్జున్
- పోలీసులు మరీ బెడ్రూమ్ వరకు వస్తారా?: అల్లు అర్జున్
- నన్ను దుస్తులు కూడా మార్చుకోనివ్వరా?: అల్లు అర్జున్
- ఇది మంచి విషయం కాదు: అల్లు అర్జున్