Fengal Cyclone Effect In Andhra Pradesh : నైరుతి బంగాళాఖాతంలో ఫెయింజల్ తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 10కి.మీ వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 100 కి.మీస చెన్నైకి 100 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. తీరానికి చేరుకునే సమయంలో నెమ్మదిగా కదిలే అవకాశముందని తెలిపారు.
శనివారం సాయంత్రానికి ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్లు తీవ్ర భారీ వానలు పడే అవకాశముందని అధికారులు వివరించారు.
రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి : తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీరం వెంట 70 నుంచి 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్‌కు అవకాశం ఉన్నట్లు పేర్కొన్మనారు. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
తుపాన్ అలర్ట్ : ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు! - ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్
పలు విమానాలు రద్దు, కొన్ని దారి మళ్లింపు :తుపాన్ ప్రభావం వల్ల చెన్నై, తిరుపతిలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల చెన్నై, తిరుపతి విమానాశ్రయాలకు వెళ్లాల్సిన పలు విమానాలు అక్కడి నుంచి బయల్దేరాల్సిన విమానాలు సైతం రద్దయ్యాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చెన్నై వెళ్లాల్సిన మూడు విమానాలు, తిరుపతి వెళ్లే 7 విమానాలు రద్దుచేశారు.
చెన్నై నుంచి హైదారాబాద్ రావాల్సిన 3 విమానాలు, తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లే 7 విమానాలు రద్దయ్యాయి. ముంబయి, దిల్లీ నుంచి చెన్నై వెళ్ళాల్సిన రెండు విమానాలు దారి మళ్లించారు. ఆదివారం ఉదయం 4 గంటల వరకు చెన్నె విమానాశ్రయంలో ఆపరేషన్స్ నిలిపిసినట్లు ఎయిర్‌పోర్ట్ అథారటీ ఆఫ్ ఇండియా అధికారులు వెల్లడించారు.
సోమవారం వరకు చేపల వేటకు వెళ్లకూడదు :ఆంధ్రప్రదేశ్‌లో ఫెయింజల్ తుపాను కారణంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో ఆకస్మికంగా వరదలలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్య్సకారులు సోమవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని చెప్పారు.
ముంచుకొస్తున్న పెంగల్ తుపాన్! - ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!!
మరికొన్ని గంటల్లో తీరం దాటనున్న తుపాన్ - ఆ జిల్లాల్లో భారీ వర్షాలు