Father and Daughter Died on Same day in Nizamabad :బలవన్మరణానికి పాల్పడి కుమార్తె, రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రెంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన మాలోత్ జ్యోతి (35)కి 15 ఏళ్ల కిందట అబ్బాపూర్ తండాకు చెందిన ప్రకాశ్‌తో వివాహం జరిగింది.
ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే నాలుగేళ్ల కిందట ప్రకాశ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి జ్యోతిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. భర్త వేధింపులు భరించలేక 21వ తేదీ సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు నిజామాబాద్‌లోని జీజీహెచ్‌కు తరలించారు.