ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ కలహాలు - తల్లీకుమారుడు మృతి - కుమార్తె పరిస్థితి విషమం

అనంతపురం జిల్లా గార్లదిన్నెలో కుటుంబం ఆత్మహత్యాయత్నం - కుటుంబకలహాలతో విషగుళికలు మింగిన తల్లి, కుమార్తె, కుమారుడు

Family_Suicide_Attempt
Family Suicide Attempt (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Family Suicide Attempt: అనంతపురం జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా తల్లి, కుమార్తె, కుమారుడు విష గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో తల్లి సుజాత మృతిచెందగా, మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలిస్తుండగా మార్గ మధ్యలో కుమారుడు చైతన్య మృతి చెందాడు. కుమార్తె రాహిత్య చికిత్స పొందుతోంది.

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన సురేష్, సుజాత దంపతులు. వీరు గార్లదిన్నెలో చిరు దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తె రాహిత్య బీటెక్ చదువుతుండగా, కుమారుడు చైతన్య ఎడో తరగతి చదువుతున్నాడు. గత కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తల్లి సుజాత, కుమార్తె రాహిత్య, కుమారుడు చైతన్య ముగ్గురూ విషపు గుళికలు మింగారు.

అపస్మారక స్థితిలో ఉన్న వీరిని చూసిన స్థానికులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి సుజాత మృతి చెందింది. రాహిత్య, చైతన్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలిస్తుండగా మార్గ మధ్యలో కుమారుడు చైతన్య మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

పెన్నుల పంచాయితీ - భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భార్య ఫొటోలు మార్ఫింగ్ చేసి బంధువులకు! - యువకుడి ప్రాణం తీసిన 2 వేలు

ABOUT THE AUTHOR

...view details