ETV Bharat / offbeat

చలికాలంలో పెరుగు తోడుకోవట్లేదా? - ఈ టిప్స్ పాటిస్తే చక్కగా గడ్డ పెరుగు సిద్ధం!

- చలికాలంలో పెరుగు తోడుకోవడం కష్టం - ఈ టిప్స్​ పాటిస్తే చక్కగా రెడీ అవుతుందంటున్న నిపుణులు

Tips to Making Thick Curd in Winter
Tips to Making Thick Curd in Winter (EtV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Tips to Making Thick Curd in Winter: భోజనంలో ఎన్ని రకాలు వెరైటీలు ఉన్నాసరే.. చివర్లో కొద్దిగా పెరుగుతో తింటేనే భోజనం చేశామన్న సంతృప్తి కలుగుతుంది చాలా మందికి. అందుకే తాము తినే భోజనంలో కచ్చితంగా పెరుగు ఉండేలా చూసుకుంటారు. అయితే.. బయట మార్కెట్లో లభించే పెరుగు మంచిది కాదని.. ఇంట్లోనే తోడుబెట్టుకుని సుష్టిగా భోంచేస్తుంటారు.

కానీ.. చలికాలంలో పెరుగు తొందరగా తోడుకోదు. ఒకవేళ పెరుగుగా మారినా.. అడుగున పాలలాగానే ఉంటుంది. చలిగాలుల వల్ల వాతావరణంలో తగ్గే ఉష్ణోగ్రతే దీనికి కారణం. దీంతో పెరుగు తినాలనుకున్నవారు దిగాలు పడిపోతుంటారు. అయితే.. అలాంటివారు ఈ టిప్స్​ పాటిస్తే చలికాలంలో కూడా గడ్డ పెరుగు తయారవుతుందని, పైగా రుచికరంగా ఉంటుందని అంటున్నారు. మరి, ఆ టిప్స్​ ఏంటే ఈ స్టోరీలో చూద్దాం..

పెరుగు తయారీ ఇలా: ఒక పాత్రలోకి పాలను తీసుకుని బాగా మరిగించాలి. కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో రెండు స్పూన్ల పెరుగు వేసి కలపాలి. ఈ పాత్రను కదపకుండా అలాగే 5 నుంచి 6 గంటలు పక్కన ఉంచితే పెరుగు సిద్ధమైపోతుంది. సాధారణంగా అయితే ఈ పద్ధతిలో సులభంగానే పెరుగు తయారైపోతుంది కానీ చలికాలంలో ఒక్కోసారి ఇలా జరగకపోవచ్చు. అలాంటప్పుడు ఈ టిప్స్​ ఫాలో అవ్వాలి. అవేంటంటే..

సాధారణంగా పెరుగు తోడుకోవాలంటే గది ఉష్ణోగ్రత 37 నుంచి 45 డిగ్రీల మధ్య ఉండాలి. కానీ చలికాలంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండవు. అందుకే ఆ వెచ్చదనాన్ని కలిగించడానికి మనమే బయటి నుంచి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. అందుకోసం..

  • పెరుగు తోడుపెట్టిన తర్వాత ఆ పాత్రని ఒక దళసరి వస్త్రంతో చుట్టాలి. ఆపై గాలి లోపలికి చొరబడకుండా పాత్ర మీద మూత పెట్టాలి. చలిగాలులు తగిలే చోట పెట్టకుండా కాస్త వెచ్చగా ఉండే ప్రదేశంలో ఆ పాత్రని ఉంచాలి. అప్పుడే పెరుగు గట్టిగా తోడుకునే అవకాశం ఉంటుంది.
  • ఇంట్లో ఓవెన్ ఉన్నవారు.. దాన్ని ఒక రెండు నిమిషాల పాటు 180డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఆఫ్​ చేయండి. ఇప్పుడు అందులో పెరుగు తోడుపెట్టిన పాత్రను ఉంచి 6 నుంచి 7 గంటలు లేదా రాత్రంతా అలా వదిలేస్తే ఉదయానికి పెరుగు గట్టిగా తోడుకుంటుంది. పైగా రుచికరంగా ఉంటుంది.
  • వంటగదిలో బియ్యం డబ్బాలో కూడా పెరుగు తోడుపెట్టిన పాత్రను ఉంచితే వెచ్చగా ఉండటంతో పాటు పెరుగు గట్టిగా తోడుకుంటుంది. కానీ పాత్రని జాగ్రత్తగా కవర్ చేయడం మాత్రం మరవకూడదంటున్నారు.
  • ఇదేవిధంగా పెరుగు తోడుపెట్టిన పాత్రని థర్మాకోల్‌తో చేసిన బాక్సులో పెట్టినా కాస్త వెచ్చగా ఉంటుంది. కాబట్టి పెరుగు గట్టిగా తోడుకుంటుంది. లేదా ఇన్సులేటెడ్ పాత్రలు/హాట్‌ పాట్‌లో పెరుగు తోడుపెట్టడం వల్ల కూడా ఫలితం ఉంటుందని అంటున్నారు.

ఇవీ కూడా:

  • పెరుగు గట్టిగా, చిక్కగా, కమ్మగా ఉండాలంటే మనం తోడుకు ఉపయోగించే పెరుగు కూడా అలాగే ఉండాలట.
  • పెరుగు తోడుపెట్టడానికి ఉపయోగించే పాలు కూడా నాణ్యమైనవై ఉండాలి. అంటే నీటి శాతం ఎక్కువగా ఉండి పలుచగా ఉంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది గట్టిగా తోడుకోకపోవచ్చు. కాబట్టి పాలు చిక్కగా ఉండేలా చూసుకోవాలి.
  • పాలల్లో పెరుగు వేసే ముందు అవి గోరువెచ్చగా ఉన్నాయో, లేదో చెక్‌ చేసుకోవాలంటున్నారు. ఎందుకంటే మరీ వేడిగా ఉన్న పాలల్లో పెరుగు వేస్తే అది అంత చిక్కగా, కమ్మగా ఉండకపోవచ్చని.. అంతేకాకుండా పెరుగు కాస్త జిగురుగా, నీళ్లలా కూడా అనిపించే అవకాశం ఉంటుంది.

పెరుగు మిగిలినప్పుడు పుల్లగా అయిందని పడేస్తున్నారా? - కానీ, ఇలా అద్భుతంగా వాడొచ్చని మీకు తెలుసా?

రాత్రిపూట పెరుగు తినొచ్చా ? ఆయుర్వేద నిపుణుల సమాధానమిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.