ETV Bharat / spiritual

మత్స్య ద్వాదశి రోజున విష్ణువును ఇలా పూజిస్తే చాలు- సకల శుభాలు కలగడం ఖాయం! - MATSYA DWADASHI 2024

మత్స్య ద్వాదశి కథ, పూజా విధానం - చేయాల్సిన దానధర్మాలు- ఫలితాలు ఇవే!

Matsya Avatar
Matsya Avatar (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2024, 4:15 PM IST

Matsya Dwadashi 2024 : మార్గశిర మాసంలో ప్రతిరోజూ పండుగే! ప్రతి తిథి విశేషమైనదే! పరమ పవిత్రమైన మోక్షదా ఏకాదశి పండుగ మరుసటి రోజు జరుపుకునే మత్స్య ద్వాదశి ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది? మత్స్య ద్వాదశి విశిష్టిత ఏమిటి? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

శ్రీహరి తొలి అవతారం మత్స్యావతారం
శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మత్స్యావతారం మొదటి అవతారం. పరమ పవిత్రమైన వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మార్గశిర శుద్ధ ద్వాదశి రోజునే మత్స్యావతారం స్వీకరించాడని వ్యాస మహర్షి రచించిన మత్స్యపురాణం ద్వారా తెలుస్తోంది. మత్స్య ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. ఈ సందర్భంగా మత్స్య ద్వాదశి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలో చూద్దాం.

మత్స్య ద్వాదశి ఎప్పుడు
మార్గశిర శుద్ధ ద్వాదశి డిసెంబర్ 11వ తేదీ బుధవారం రాత్రి 1:09 గంటల నుంచి డిసెంబర్ 12వ తేదీ గురువారం రాత్రి 12 గంటల వరకు ఉంది. కాబట్టి డిసెంబర్ 12వ తేదీ గురువారం రోజునే మత్స్య ద్వాదశిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పూజకు శుభ సమయం.

మత్స్య ద్వాదశి విశిష్టత
మత్స్య ద్వాదశి రోజున శ్రీహరి మత్స్యావతారము ధరించి హయగ్రీవ అనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించాడని నమ్ముతారు. మత్స్య ద్వాదశి నాడు శ్రీమహావిష్ణువు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.

మత్స్య ద్వాదశి పూజా విధానం
మత్స్య ద్వాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలారా స్నానం చేసి శుచియై పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. నాలుగు రాగి కలశాలలోకి గంగాజలాన్ని తీసుకొని అందులో పువ్వులు, అక్షింతలు వేసి పూజా స్థలంలో ప్రతిష్టించాలి. ఇప్పుడు నాలుగు కలశాలను నువ్వులతో కప్పి, వాటి ముందు పసుపుతో తయారు చేసిన విష్ణువు స్వరూపాన్ని తమలపాకులో ఉంచాలి.

శాస్త్రోక్తంగా పూజ ఇలా చేయాలి?
ఈ నాలుగు కలశాలు సముద్రానికి ప్రతీకగా చెప్తారు. ఆ తర్వాత విష్ణువు ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. తర్వాత కుంకుమ, పూలు, తులసి ఆకులు, అక్షింతలు వేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. చక్ర పొంగలి, పులిహోర, కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం కర్పూర నీరాజనాలు ఇచ్చి ఓం మత్స్య రూపాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

చేపలకు ఆహారం
మత్స్య ద్వాదశి రోజున చెరువులలో, నదులలోని చేపలకు పిండి ముద్దలు ఆహారంగా సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వలన జాతక దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అనంతరం మత్స్య ద్వాదశి కథను చదువుకోవాలి.

ఈ దానాలు శ్రేష్ఠం
మత్స్య ద్వాదశి రోజున బ్రాహ్మణులకు అన్నదానం, జలదానం, వస్త్రదానం, గోదానం చేయడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం. రానున్న మత్స్య ద్వాదశి రోజు మనం కూడా శాస్త్రంలో చెప్పిన విధంగా శ్రీహరిని పూజిద్దాం. సకల శుభాలను పొందుదాం. ఓం నమో నారాయణాయ నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.