Mohan Babu Another Audio Release about Attack on Journalist: తాను జర్నలిస్టును కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదని నటుడు మోహన్‌బాబు అన్నారు. ఈ మేరకు ఓ ఆడియో ప్రకటన విడుదల చేశారు. తన ఇంట్లోకి దూసుకొచ్చేది జర్నలిస్టులా కాదా అనే విషయం తనకు తెలియదని అన్నారు. జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నట్లు వెల్లడించారు.
కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా ఇది ప్రజలు, రాజకీయ నాయకులు ఆలోచించాలని అన్నారు. మీడియాను అడ్డుపెట్టుకొని నాపై దాడి చేసే అవకాశం ఉందని ఆలోచించానని, అది కూడా చీకట్లో ఘర్షణ జరిగిందని తెలిపారు. తాను కొట్టిన దెబ్బ మీడియా ప్రతినిధికి తగలడం బాధాకరమని అన్నారు. ఆ మీడియా ప్రతినిధి తనకు తమ్ముడి లాంటివాడని సంభోదించారు. అతని భార్యాబిడ్డల గురించి ఆలోచించానని, కానీ నా బాధ గురించి ఎవరూ ఆలోచించలేదని అన్నారు. సినిమాల్లో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదని మోహన్‌బాబు అన్నారు.
నాకున్న ఒక్కటే ధైర్యం, సాహసం అని నీతిగా, ధర్మంగా బతకాలన్నదే నా ఆలోచన అని మోహన్ బాబు అన్నారు. గేటు బయట అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టి ఉంటే తనపై 50 కేసులు పెట్టుకోవచ్చని, అరెస్టు చేసుకోవచ్చని వెల్లడించారు. తానే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అరెస్టు అయ్యే వాడిని అని కానీ నా ఇంట్లోకి వచ్చి నా ఏకాగ్రతను, ప్రశాంతతను భగ్నం చేశారని వివరించారు. నా బిడ్డే నా ప్రశాంతతను చెడగొడుతున్నాడని ఇది మా కుటుంబ సమస్య కాబట్టి మేం కూర్చొని మాట్లాడుకుంటామని మోహన్‌బాబు వెల్లడించారు.
ఏదో ఒక రోజు మా సమస్య పరిష్కారం అవుతుందని మోహన్‌బాబు తెలిపారు. కుటుంబసభ్యుల గొడవకు మధ్యవర్తులు అవసరం లేదని అన్నారు. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను కానీ అవన్నీ మరిచిపోయి మీడియా ప్రతినిధిని కొట్టిన విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఆ వ్యక్తిని కొట్టిన విషయం తప్పే కానీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలని కోరారు. మీకు టీవీలు ఉండొచ్చు కానీ నేను కూడా రేపు టీవీ పెట్టొచ్చని అన్నారు. మీడియా ప్రతినిధిని కొట్టినందుకు చింతిస్తున్నానని తాను కొట్టింది వాస్తవమే, అసత్యం కాదని మోహన్‌బాబు అన్నారు.
ఇంటికి వెళ్లిన మోహన్‌బాబు - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
మోహన్‌బాబు, విష్ణులకు హైకోర్టులో ఊరట - పోలీసుల నోటీసులపై స్టే