Road Closed to Bhavana Township Kadapa: వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతకు అధికారులు షాక్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వెంచర్‌కి దారి లేకుండా రాత్రికి రాత్రే గోడ కట్టేశారు. అంతే కాకుండా టౌన్‌షిప్‌నకు ఎదురుగా ఉన్న వంతెనను సైతం కూల్చేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాత్రికి రాత్రే గోడ ప్రత్యక్షం: గత ప్రభుత్వ హయాంలో కారు చౌకగా వివాదాస్పద భూములు కొట్టేసి టౌన్షిప్ నిర్మించారని అభియోగాలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నేత రాజేంద్రనాథ్ రెడ్డికి చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్‌కు అధికారులు దారి లేకుండా అడ్డుకట్ట వేశారు. వైఎస్సార్ జిల్లా సీకే దిన్నె మండలం సమీపంలో ఉన్న భావన టౌన్ షిప్‌నకు ఎదురుగా ఉన్న పాత వంతెనకు అడ్డంగా రాత్రికి రాత్రే ఆర్ అండ్ బి అధికారులు గోడ నిర్మించారు. పాత వంతెనపై వాహనాల రాకపోకలను నిషేధించామని తెలిపారు. వంతెన పాతది కావడం వల్లే ఇక్కడ అడ్డుకట్ట వేశామని అధికారులు బోర్డు సైతం పెట్టారు.
అయితే వైఎస్సార్సీపీ నేత రాజేంద్రనాథ్ రెడ్డి టౌన్షిప్ లోపలికి వెళ్లాలంటే ఈ పాత వంతెన మీద నుంచే వెళ్లాల్సి రావడంతో యథేచ్ఛగా వాహన రాకపోకలు సాగేవి. భూములు కాజేసిన వైఎస్సార్సీపీ నేతకు అధికారులు అండగా ఉన్నారని పలువురు కూటమి నేతలు గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్సార్సీపీ నేతకు చెక్ పెట్టేందుకు ఏకంగా ఆయన టౌన్షిప్నకి ఎటువంటి రాకపోకలు లేకుండా రహదారికి అడ్డంగా పాత వంతెనపైన అడ్డంగా గోడ కట్టేశారు.
వంతెన కూల్చేందుకు సైతం యత్నం: అది కూడా రాత్రికి రాత్రే నిర్మించడం విశేషం. పాత వంతెనను రెండు జెసీబీలతో కూల్చేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో భావన టౌన్‌షిప్‌లోకి వెళ్లాలంటే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసులు, అధికారులు లెక్కచేయకుండా రాత్రికి రాత్రే బ్రిడ్జి వద్ద గోడ నిర్మించేశారు. దీంతో భావన టౌన్షిప్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
'పెళ్లికి వెళ్లి వచ్చేలోపే గేటు ముందు గోడ కట్టేశారు- ఇంట్లోకెలా వెళ్తాం'
ఫ్రీహోల్డ్ పేరుతో 1.26 లక్షల ఎకరాల్లో వైఎస్సార్సీపీ నేతల అక్రమాలు