ETV Bharat / state

ఒడిశా నుంచి లారీల్లో రవాణా - కోటి రూపాయల గంజాయి సీజ్ - 1800 KG GANJA SEIZED

అల్లూరి జిల్లా కూనవరంలో రూ.50 లక్షల విలువైన వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం - విజయనగరం జిల్లాలో 800 కిలోల గంజాయి సీజ్

Ganja_Seized
Ganja Seized (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

1800 KG Ganja Seized: అల్లూరి జిల్లా కూనవరంలో పెద్దఎత్తున గంజాయి పట్టుబడింది. వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి కూనవరం మీదుగా గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ 50 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. నిందితులు పశ్చిమబెంగాల్‌కు చెందిన ముఠాగా తెలిపారు. పుష్ప సినిమా తరహాలో 25 బస్తాల్లో 40 కిలోల చొప్పున గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎటపాక సీఐ కన్నప్పరాజు తెలిపారు.

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన గంజాయి ముఠా ఒడిశా నుంచి పాత అల్యూమినియం సామగ్రి తెచ్చినట్లు నటించారు. పుష్ప సినిమా తరహాలో 25 బస్తాల్లో 40 కిలోల చొప్పున 1000 కిలోలు గంజాయి రవాణా చేస్తున్నారు. ముందస్తు సమాచారంతో కూనవరంలో పోలీసులు అడ్డుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని, 1000 కిలోల గంజాయిని సీజ్ చేశారు.

చెక్‌పోస్ట్‌ వద్ద 800 కిలోల గంజాయి స్వాధీనం: విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో పెద్దఎత్తున గంజాయి పట్టుబడింది. కొట్టెక్కి చెక్‌పోస్ట్‌ నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి లారీని ట్రేస్‌ చేసి కొట్టెక్కి చెక్‌పోస్ట్‌ వద్ద పట్టుకున్నట్లు సీఐ నారాయణరావు తెలిపారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

లారీలో గంజాయి ఉందని అనుమానంతో ఒరిస్సా నుంచి ట్రాక్ చేసి లారీని కొట్టెక్కి చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్, క్లీనర్​తో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొన్నామన్నారు. లారీలో ఉన్న గంజాయిని రామభద్రపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆందోళన కలిగిస్తోన్న గంజాయి: గంజాయి లభ్యత, విక్రయాలతో పాటు వినియోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బహిరంగ మార్కెట్​లో లభించే సాధారణ మత్తుపదార్థంగా గంజాయి మారిపోయింది. శివారు ప్రాంతాలు, ఇళ్లు, దుకాణాలు సైతం గంజాయి హాట్‌స్పాట్లుగా మారాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా నిత్యం కిలోల కొద్దీ గంజాయిని పోలీసులు పట్టుకుంటున్నారు. గంజాయిని సీజ్‌ చేయడం, నిందితులపై కేసులు నమోదు చేయడం వరకూ బాగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో దీనిని వినియోగించే వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

నీళ్లలో ఆకులు వేసి వేడి చేసి - దొరక్కుండా గంజాయి స్మగ్లర్ల అతి తెలివి

బెయిల్ ఇస్తే దొరకరంతే! - పరారీలో 900మంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.