ETV Bharat / politics

భూ ఆక్రమణలపై కఠినంగా ఉండాలి - ప్రజలు మెచ్చుకునేలా కలెక్టర్లు వ్యవహరించాలి : సీఎం చంద్రబాబు

ప్రజలకు భరోసా ఇచ్చేలా రెవెన్యూ యంత్రాంగం ఉండాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు

chandrababu_on_revenue_issues
chandrababu_on_revenue_issues (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

CM Chandrababu on Revenue Issues : వైఎస్సార్సీపీ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల్లో భయం పట్టుకుందని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు భూ వ్యవహారాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేసి దందాలు చేశారని మండిపడ్డారు. కడప, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భూ అక్రమాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 లక్షల ఎకరాలకు పైగా ఫ్రీ హోల్డ్ భూముల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకువచ్చామని సీఎం స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలన్నీ సరి చేయాల్సి ఉందని వెల్లడించారు.

జగనన్న కాలనీల్లో అనర్హులకు ఇచ్చిన ఇళ్లస్థలాల విషయంపై రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ విచారణ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి పోలీసులకు వచ్చే ఫిర్యాదులపై జాయింట్ టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలని సూచించారు. భూ అక్రమాలకు సంబంధించి లాగిన్ వివరాలను సైబర్ నిపుణుల ద్వారా తెలుసుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. భూ ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తే తప్ప భవిష్యత్తులో ఈ తరహా నేరాలు తగ్గవన్నారు. అంతిమంగా ప్రజలు మెచ్చుకునేలా కలెక్టర్లు వ్యవహరించాలని పేర్కొన్నారు.

భూ ఆక్రమణలు చేస్తే పీడీ యాక్ట్: రాష్ట్రంలో భూ కబ్జాలు జరగకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వెల్లడించారు. భూ ఆక్రమణల లాంటి వాటిని నేరంగా పరిగణిస్తూ నిందితులపై పీడీ యాక్ట్ పెట్టేలా చర్యలు చేపట్టామని వివరించారు. రీసర్వేలో చాలా పొరపాట్లు దొర్లాయని వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. భూహక్కు పత్రాల్లో పార్టీలు, వ్యక్తుల ఫొటోలు లేకుండా ప్రభుత్వ అధికారిక ముద్రమాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. 2,444 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ జరిగితే 41 వేల వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని వీటి పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు - 8వేల కోట్ల నిధులకు ఏడీబీ ఆమోదం

ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలో 4 చోట్ల జోనల్ సదస్సులు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రెవెన్యూ శాఖలో తెచ్చిన సంస్కరణల కారణంగా కేంద్రం కూడా కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చిందని తెలిపారు. ఫ్రీహోల్డ్ భూముల్లో 4.47 లక్షల ఎకరాల్లో అవకతవకలు గుర్తించామని ఇందులో 25,284 ఎకరాలు రిజిస్ట్రేషన్లు చేసేశారని ప్రస్తుతం వాటిని నిలుపుదల చేశామన్నారు. అన్నమయ్య, సత్య సాయి, చిత్తూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఫ్రీహోల్డ్ భూముల అవకతవకలు జరిగాయని అన్నారు. అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్ పత్రాలను రద్దు చేయాలని సిసోడియా ఆదేశించారు.

వృద్ధులు యాచకుల్లా మారుతున్నారు: ప్రభుత్వానికి ప్రతిరూపంగా జిల్లా కలెక్టర్లు ప్రజల దృష్టిలో ఉంటారని సిసోడియా వ్యాఖ్యానించారు. దానికి అనుగుణంగానే కలెక్టర్లు ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వృద్ధులు ఇళ్లకు దూరంగా ఉంటూ యాచకుల్లా మారుతున్నారని, వారు ఇళ్లకు దూరంగా ఉండకుండా చూడాలని సూచించారు. వారి కుటుంబ సభ్యులను వారి బాగోగులు చూసుకునేలా ఆదేశించవచ్చని అన్నారు. సీఆర్పీసీ 133 సెక్షన్ ప్రకారం వారి కుమారులు, కుమార్తెలకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. రెగ్యులేటరీ రోల్​ను కలెక్టర్లు మర్చిపోవద్దని ఆర్పీ సిసోడియా విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టును కొట్టాలని అనుకోలేదు - మోహన్​బాబు ఆడియో రిలీజ్​

పరిశ్రమల కోసం నానా తంటాలు పడుతున్నాం - సీరియస్​గా ఫాలో అప్ చేయండి : సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.