ETV Bharat / state

మహిళలకు ఎలక్ట్రిక్ ఆటో - అతివల ఆర్థిక స్వావలంబనపై ప్రభుత్వం దృష్టి

మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు - డ్రైవింగ్‌ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించాలని భావిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం

electric_autos_to_women
electric_autos_to_women (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Telangana Govt Provide Electric Autos to Womens: ఎలక్ట్రిక్‌ వాహనాల నూతన పాలసీని తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం మరో అంశంపై దృష్టి సారించింది. ఓ వైపు కాలుష్యాన్ని నియంత్రించే ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలని అనుకుంటోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌ ఆటోల్ని కొని డ్రైవింగ్‌ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఓ కొత్త పథకంపై దృష్టి సారించింది. మహిళలకు ఆటో డ్రైవింగ్ నేర్పే ఓ సంస్థ ఆ శాఖ అధికారుల్ని ఇటీవల కలిసింది. కాగా ఆటో కొనుగోలుకు అయ్యే వ్యయంలో కొంత మొత్తాన్ని భరించే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

మహిళలకు ఆటో డ్రైవింగ్‌ శిక్షణ: సాధారణంగా ఆటో నడపడం కొంత కష్టంగా ఉంటుంది. అందుకే ఈ రంగంలో మహిళా డ్రైవర్లు తక్కువగా కనిపిస్తుంటారు. కొంతకాలంగా ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి పెరుగుతోంది. జహీరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ ఆటోల ప్లాంట్‌ ఒకటి ఉంది. డీజిల్, సీఎన్జీతో నడిచే ఆటోలతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ ఆటోల్ని నడపడం చాలా సులభం. దీంతో ఆ కంపెనీ, సోదరసంస్థ కలిసి ఇప్పటికే కొంతమంది మహిళలకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆటో డ్రైవింగ్‌ శిక్షణ ఇస్తోంది. ఆటో డ్రైవింగ్‌ నేర్చుకున్నవారికి జీతం ఇచ్చి నడిపిస్తోంది. మరి కొంతమందికి అద్దె పద్ధతిలోనూ ఇస్తోంది. కుటుంబ అవసరాల కోసం ఉపాధిని వెతుక్కుంటున్న మహిళలు డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నారు.

ప్రైవేటు ట్రావెల్స్ బస్​ డ్రైవర్ దాష్టీకం - అయ్యప్ప భక్తుల బ్యాగులు పడేసి ఉడాయించిన వైనం

కాలుష్య సమస్యకు పరిష్కారం: తెలంగాణలోని కొన్ని ముఖ్యమైన నగరాలు అయిన హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాల్లో కాలుష్యం బాగా పెరుగుతోంది. డీజిల్‌ ఆటోలు లక్షల్లో ఉన్నాయి. హైదరాబాద్‌లో కాలుష్య సమస్య పరిష్కారంలో భాగంగా డీజిల్‌ బస్సులను, డీజిల్‌ ఆటోలను ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతలకు తరలించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ ఆటోలు కొనే వారికి ఓ కొత్త పథకాన్ని రూపొందించాలనీ రవాణాశాఖకు సూచించారు. ఈ క్రమంలో ఉపాధి పథకాల్లో భాగంగా మహిళలకు ఎలక్ట్రిక్‌ ఆటోలను కొనుగోలు చేయించడంపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ దృష్టి పెట్టింది. అయితే ఈ పథకంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఉన్నతాధికారులు తెలిపారు.

మహిళలకు ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు 'ఇటో' కంపెనీ ఉపాధ్యక్షురాలు ప్రీతి బెలిండ జాస్తి తెలిపారు. మహిళా సంక్షేమ శాఖతో కొద్దిరోజుల క్రితం తొలివిడత చర్చలు జరిపినట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆసక్తి ఉన్న మహిళలను ఎంపికచేసి డ్రైవింగ్‌ నేర్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తమ సంస్థలో 20 మంది నేర్చుకుంటున్నారని వివరించారు.

మద్యం మత్తులో పోలీస్ స్టేషన్​లో భార్య - కాలనీలో బూట్లు చోరీ చేసిన భర్త

వైఎస్సార్సీపీ హయాంలో మరో కుంభకోణం! - హైకోర్టులో పిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.