ETV Bharat / state

సర్కారీ స్కూళ్లకు స్టార్ రేటింగ్‌ - కేజీ నుంచి పీజీ వరకూ సంస్కరణలు : లోకేశ్ - LOKESH RATING ON GOVT SCHOOLS

జిల్లాలు, మండలాలవారీగా స్కూళ్ల నివేదిక విడుదల - విద్య, మౌలికవసతులపై ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్​

Minister Nara Lokesh Rated Government Schools
Minister Nara Lokesh Rated Government Schools (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2024, 7:04 PM IST

Minister Nara Lokesh Rated Government Schools : పాఠశాలకు సంబంధించి జిల్లాలు, మండలాలవారీగా రిపోర్టు కార్డులను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. అకడెమిక్స్, మౌలిక సదుపాయాల పై ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇచ్చారు. ఇదే అంశాలపై ప్రతీ కలెక్టర్​కు రేటింగ్, రిపోర్టు కార్డ్ ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, విద్యా పరంగా ప్రతీ పాఠశాలలోనూ ప్రగతి కనిపించాలన్నారు. విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారా? ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నారా? అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉందన్నారు. మధ్యాహ్న భోజనంలో పోషక విలువలు ఉండేలా చూడాలని సీఎం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్టు లోకేశ్ గుర్తుచేశారు.

ఉన్నత విద్యాశాఖలోనూ భోజనం విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. హాస్టళ్లలో శానిటేషన్ పై తీవ్రమైన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. టాయిలెట్స్ లాంటి మౌలికమైన సదుపాయాలు కూడా సరిగ్గా ఉండటం లేదన్నారు. విద్యార్ధుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని తెలిపారు. పేరెంట్స్ టీచర్ల మీటింగ్ లో డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ చేపట్టి, యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ మరింత విస్తృతం చేస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ పాఠ్యాంశాల్లో సంస్కరణలు రావాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చాలా మార్పులు కనిపించాలని అన్నారు. విద్యార్ధులకు ఆపార్ ఐడీ విషయంలో తల్లిదండ్రులు కాసింత ఇబ్బందులు పడ్డారని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

'రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్' - ఆరు నెలల పాలనపై చంద్రబాబు, లోకేశ్ ఏమన్నారంటే!

గత ఐదేళ్లలో జగన్ సర్కార్ విద్యారంగాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. రాబోయే 5 ఏళ్లలో మౌలిక సదుపాయాలు, ఫలితాలపై దృష్టిసారించి ఏపీ మోడల్ విద్యావ్యవస్థ రూపకల్పనకు అధికారులంతా నడుం బిగించాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో మానవవనరుల శాఖపై సమీక్షలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ రోల్ మెంట్ పెరగాలన్నారు. జీరో డ్రాపవుట్స్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు, ఎకడమిక్ ఫలితాలకు పొంతన ఉండటం లేదని తెలిపారు. పారదర్శకమైన విధానాలతో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

మౌలిక సదుపాయాలు, ఎకడమిక్ పెర్ఫార్మెన్స్​ను పొందుపరుస్తూ జిల్లాలవారీగా ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులను అందజేస్తున్నామని లోకేశ్ తెలిపారు. రాబోయే వందరోజుల యాక్షన్ ప్లాన్ కు అనుగుణంగా అధికారులు దృష్టిసారించాలని సమీక్షలో వివరించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంపై దృష్టి సారించాలన్నారు. పోషకవిలువలు కలిగిన పౌష్టికాహారం అందజేసేందుకు చర్యలు చేపట్టాల్సి ఉందని తెలిపారు.

వాట్సప్ ద్వారా 153 సేవలు - సమాచారమంతా ఒకే వెబ్‌సైట్​లో

ఉన్నత విద్యలో కూడా హాస్టల్, భోజన సౌకర్యాలపై దృష్టిపెట్టాలని కలెక్టర్లకు సూచించారు. ఇటీవల చాలా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. హాస్టళ్లలో శానిటేషన్ నిర్వహణ, కనీస మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రతివారం విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే విధానాన్ని చేపట్టాలని కోరారు. ఫీడ్ బ్యాక్ ఆధారంగా మెస్, సౌకర్యాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.

అన్ని స్కూళ్లు, కాలేజీల్లో ఈగల్ టీమ్స్, క్లబ్స్ ఏర్పాటుచేసి పెద్దఎత్తున విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కేజీ టు పీజీ కరిక్యులమ్ ప్రక్షాళనకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అపార్ ఐడీ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయన్నారు. దీనివల్ల కొందరు తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారని గుర్తుచేాశారు. సాంకేతిక సమస్యలు అధిగమించి పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులంతా కృషిచేయాలని మంత్రి లోకేశ్ కోరారు.

భూ అక్రమాలపై ఓ కుటుంబం ఫిర్యాదు - 'ఎక్స్‌'లో స్పందించిన లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.