ETV Bharat / state

దిల్లీ ఎన్నికలు - ఫిబ్రవరి 2న చంద్రబాబు ప్రచారం - TDP PARLIAMENTARY MEETING

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ - దిల్లీలో తెలుగువారు ఉన్నచోట్ల ప్రచారం చేయాలని ఎంపీలకు సీఎం సూచన

TDP_PARLIAMENTARY_MEETING
TDP_PARLIAMENTARY_MEETING (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2025, 10:20 PM IST

Telugu Desam Parlamentary Party Meeting: ఫిబ్రవరి 2వ తేదీన దిల్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా దిల్లీలోని తెలుగు అసోసియేషన్ ఆహ్వానించింది. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఎంపీలకు సీఎం సూచించారు. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశం ముగిసింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహం, నిధుల సాధనకు సమన్వయంపై చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.

బడ్జెట్​లో కేటాయింపులకు అదనంగా కేంద్రం నుంచి ఏం రాబట్టాలి అనే కోణంలో చర్చ జరిగిందని ఎంపీలు వెల్లడించారు. శాఖల పరంగా సమన్వయంపై సీఎం పలు సూచనలు చేశారన్నారు. 7 నెలల పనితీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేసారని ఎంపీలు తెలిపారు. మున్ముందు ఇదే జోరు కొనసాగించాలని సూచించారన్నారు. శాఖల పరంగా సమన్వయం పెంచాలని ఆదేశించారని నేతలు తెలిపారు. రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం చేసారని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ స్థానం పరిధిలో పార్టీ బలోపేతం పైనా సీఎం సూచనలు చేశారన్నారు.

వైఎస్సార్సీపీ సాధించలేనివి తాము సాధించాము: సమావేశం అనంతరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో సాధించలేనివి తాము 7 నెలల్లో సాధించామని అన్నారు. అమరావతి, పోలవరం, స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ తీసుకొచ్చినట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రను లూటీ చేశారని, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు.

సెంచరీకి సిద్ధమైన ఇస్రో - కీలక పరికరాలు అందజేస్తున్న కంపెనీ గురించి మీకు తెలుసా?

త్వరలో ప్రతి శనివారం 'నో బ్యాగ్​డే' - ఉపాధ్యాయులకు ఒకటే యాప్: మంత్రి లోకేశ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.