Financial Assistance to Autos: 2024 ఆగస్టు - సెప్టెంబర్ నెలల్లో విజయవాడలో వచ్చిన వరదల కారణంగా దెబ్బతిన్న ఆటోలకు పరిహారాన్ని ప్రభుత్వం పెంచింది. వరదనీటిలో మునిగి పాడైన ఆటోలకు రూ.10 వేల నుంచి 20 వేలకు పరిహారం పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పరిహారం పెంచుతూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో దెబ్బతిన్న ఆటో రిక్షాలకు 10 వేలు చెల్లించాలని నిర్ణయించారు.
ఉదారంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచనల మేరకు పరిహారం 20 వేల చొప్పున పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు 5000 రూపాయలు మాత్రమే పరిహారం ఇవ్వాల్సి ఉంది. నిబంధనలు పక్కన పెట్టి బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఒక్కో ఆటో రిక్షాకు పరిహారాన్ని 20 వేలకు పెంపుదల చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.