Fake Passport Gang Arrest In Telangana : నకిలీ ధ్రువీకరణ పత్రాలతో విదేశీయులకు భారత పౌరులుగా పాస్‌పోర్టులు ఇప్పించి గల్ఫ్ దేశాలకు పంపించిన ముఠా గుట్టు రట్టయింది. తెలంగాణ సీఐడీ విభాగం ప్రాథమిక దర్యాప్తులో హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కోరుట్లలో జరిగిన దందా బహిర్గతమైంది. నకిలీ పత్రాలతో పాస్‌పోర్టులను సృష్టించడం ద్వారా 92 మందిని భారతీయులుగా దేశం దాటించినట్లు వెల్లడైంది. హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్‌హిల్స్ బడీ మసీద్ ప్రాంతానికి చెందిన అబ్దుస్ సత్తార్ ఒస్మాన్ అల్ జవహరీ (50) సూత్రధారిగా సాగిన ఈ దందాలో మరో 9 మంది గల్ఫ్‌ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ ముఠాకు సహకరించినట్లు వెల్లడి కావడంతో ఇద్దరు స్పెషల్‌బ్రాంచి సిబ్బందిని అరెస్టుచేశారు.
Police Arrested Fake Passport Gang In Hyderabad : ముఠా సూత్రధారి అబ్దుస్ సత్తార్ తొలుత నాంపల్లిలో గ్రాఫిక్ డిజైనింగ్, ప్రింటింగ్ పని చేసేవాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు 2011లో నకిలీపత్రాలను సృష్టించే దందాకు తెరలేపాడు. అవసరమైనవారికి బోగస్ విద్యార్హత, జనన ధ్రువీకరణపత్రాలను తయారుచేసి ఇచ్చేవాడు. అనంతరం పాస్‌పోర్టుల జారీ ప్రక్రియపై దృష్టి సారించాడు. చెన్నైకి చెందిన ఓ బ్రోకర్‌తో పరిచయం ఏర్పరుచుకొని శ్రీలంక దేశస్థులతో పాటు శరణార్థులతో సంబంధాలున్న ఆ బ్రోకర్‌కు నకిలీ ధ్రువీకరణ పత్రాలను సమకూర్చేందుకు సత్తార్ ఒప్పుకున్నాడు.
Passport Services In Hyderabad : పాస్‌పోర్ట్ సేవలు మరింత చేరువ.. ఇక నుంచి తపాలా కార్యాలయాల్లోనూ
విదేశీయులను భారత పౌరులుగా చూపేందుకు నకిలీ జనన ధ్రువీకరణ, విద్యార్హత పత్రాలను సృష్టించడం.. ఇతరుల ఆధార్ లేదా ఓటర్ ఐడీ కార్డుల్లోని ఫొటో, పేరు, వయసు, చిరునామా మార్చి ఇచ్చేందుకు అంగీకరించాడు. అలా ఒక్కో విదేశీయుడి పాస్‌పోర్టుకు అవసరమైన తప్పుడు దృవీకరణ పత్రాలను సృష్టించినందుకు సత్తార్‌కు చెన్నై బ్రోకర్ రూ.75 వేల చొప్పున ఇచ్చేవాడు. అలా బ్రోకర్ పంపించిన పేర్లను పాస్‌పోర్టుకు అవసరమైన స్లాట్లను సత్తార్ బుక్ చేసేవాడు. పాస్‌పోర్టు కేంద్రంలో విచారణ సమయంలో నకిలీ భారతీయులను చెన్నై బ్రోకర్ తెలంగాణకు పంపించాడు. అలాగే పాస్‌పోర్టు ఇచ్చే ముందు జరిగే స్పెషల్‌బ్రాంచి విచారణన సందర్భంగా పోలీసు సిబ్బందిని మేనేజ్ చేసేవారు. అలా సుమారు 100 వరకు నకిలీ పాస్‌పోర్టులను సత్తార్ ముఠా సృష్టించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
Hyderabad Police Arrests Fake Passport: సత్తార్ ముఠా బోగస్ దందాపై దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ శుక్రవారం 12 బృందాలతో హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కోరుట్లలోని ఏజెంట్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. 108 పాస్‌పోర్టులు, 15 సెల్‌ఫోన్లు, 5 ల్యాప్‌టాప్‌లు తదితర సామగ్రితో పాటు కీలకపత్రాలను స్వాధీనం చేసుకుంది. తొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. చెన్నై బ్రోకర్‌ను బెంగళూరులో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. అసలు విదేశీయులకు భారత పాస్‌పోర్టులను ఎందుకు ఇప్పిస్తున్నారనే కారణాలపై ఆరా తీసేందుకు నిందితులను కస్టడీకి తీసుకోనుంది.
'రాష్ట్రంలో పాస్‌పోర్టుల జారీలో పారదర్శకతను మరింత పెంచేందుకు కృషి'
Passport: ఏప్రిల్ 29 నుంచి హైదరాబాద్‌లో స్పెషల్ పాస్‌పోర్ట్ డ్రైవ్