తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ యాక్ససరీస్​కు ఐఫోన్ స్టిక్కర్స్ - ఇక్కడ కొన్నారంటే ఇంతే సంగతులు!

అబిడ్స్ జగదీశ్​ మార్కెట్‌లో పోలీసుల సోదాలు - నకిలీ ఐఫోన్‌ ఉపకరణాలు విక్రయిస్తున్న నలుగురు అరెస్టు - నిందితుల నుంచి రెండున్నర కోట్ల రూపాయల విలువైన ఉపకరణాలు సీజ్​

Fake Iphones in Jagdish Market
Fake Iphones in Jagdish Market (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 1 hours ago

Fake Iphone Accessories in Jagdish Market :ఇక్కడ మీకు అతి తక్కువ ధరలలో మీకు నచ్చిన ఫోన్​ దొరుకుతుంది. లక్షల రూపాయల ఫోన్లు నుంచి కేవలం రూ.500లకే లభించే ఫోన్​ వరకు ఇక్కడ అమ్మబడతాయి. అంతే కాదు ఏ ఫోన్​ విడిభాగాలు కావాలన్న ఇక్కడ అతి చీఫ్​ కాస్ట్​తోనే కొనేయొచ్చు. ఒరేయ్​! ఫోన్​ డిస్​ప్లే పగిలిపోయిందిరా ఎక్కడ తక్కువ ధరకు వేస్తారంటే అందరూ ఆ మార్కెట్​కు వెళ్లు అని చెబుతారు. అంతలా ఫేమస్​ అయింది ఆ మార్కెట్.

ఈ పరంగానే కాకుండా మోసం చేయడంలోనూ ఆ మార్కెట్​ గొప్ప పేరునే సొంతం చేసుకుంది. కొట్టేసిన ఫోన్లను కూడా ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారని సమాచారం. ఇప్పటికే అర్థమై ఉంటుంది అది ఏ మార్కెట్​నో అదే అబిడ్స్​లో ఉన్న జగదీశ్​ మార్కెట్​. ఇప్పుడు తాజాగా ఇక్కడ ఫేక్​ ఐఫోన్ పరికరాలను కూడా విక్రయిస్తున్నారు. సో అందుకే జగదీశ్​కు మార్కెట్​కు వెళ్లేటప్పుడు బీ కేర్​ ఫుల్​గా జాగ్రత్తగా ఉండటమే బెటర్.

సుమారు రూ.2.5 కోట్ల నకిలీ ఐఫోన్ల పరికరాలు స్వాధీనం : హైదరాబాద్​లో ఉన్న జగదీశ్​ మార్కెట్​లో నకిలీ ఐఫోన్లు పరికరాలను విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మార్కెట్​లో సోదాలు జరిపిన పోలీసులు భారీమొత్తంలో వీటిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులు అబిడ్స్​లోని జగదీష్ మార్కెట్లో నాలుగు మొబైల్ షాప్స్​పై దాడి చేశారు.

ఈ సందర్భంగా టార్గెట్ మొబైల్ షాప్ ఓనర్ నింబ్ సింగ్, పటేల్ మొబైల్ షాప్ ఓనర్ హీరా రామ్, ఔషపుర మొబైల్ షాప్ ఓనర్ గోవింద్​లాల్ చౌహాన్, నంది మొబైల్స్ ఓనర్ ముకేష్ జైన్లను అరెస్టు చేశారు. వారి నుంచి ఆపిల్ బ్రాండ్ ప్రింటింగ్ లోగోలతో ఉన్న నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఎయిర్ పాడ్స్ 579, యుఎస్బీ అడాప్టర్స్ 351, యుఎస్బీ పవర్ కేబుల్ 747, బ్యాటరీలు 62, పవర్ బ్యాంక్ 17, బ్యాక్ పౌచ్ 1401 స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్లో 2 కోట్ల 42 లక్షల 55 వేల 9 వందలు ఉంటుందని టాస్క్​ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర వెల్లడించారు. తదుపరి విచారణ నిమిత్తమై నిందితులను నలుగురిని అబిడ్స్ పోలీసులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Fake Iphone Accessories in Hyderabad : హైదరాబాద్​లో ఐఫోన్ విడిభాగాలు కొంటున్నారా.. అయితే జాగ్రత్త...

ఐఫోన్ 16 కోసం ఎగ‌బ‌డ్డ జ‌నం - యాపిల్ స్టోర్ల ముందు భారీ క్యూ - వీడియో చూశారా? - iPhone 16 Series Sales in India

Last Updated : 1 hours ago

ABOUT THE AUTHOR

...view details