IRREGULAR SWEET SHOPS IN AMEERPET : హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని పలు స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అవాక్కయ్యారు. పేరున్న స్వీట్స్ షాప్స్‌తో సహా చాలా దుకాణాలు ఫుడ్ సేప్టీ నిబంధనలు పాచించడం లేదని గుర్తించారు. అమీర్‌పేటలో ఫేమస్ అయిన వాసిరెడ్డి ఫుడ్స్, వినూత్న ఫుడ్స్, ఢిల్లీ మిఠాయి వాలా, ఆగ్రా స్వీట్.. సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్నాయని తనిఖీల్లో తేలింది. స్వీట్ షాప్‌లో అమ్మే వస్తువులకు ఎలాంటి లెబెల్, ఎక్స్‌పైరీ డేట్ లేదని అధికారులు గుర్తించారు. అలాగే కిచెన్‌లో మిఠాయిలు తయారు చేస్తున్న సమయంలో హెడ్ కాప్స్, యాప్రాన్స్ ధరించలేదని చెప్పారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికెట్ తేదీ గడువు ముగిసినా రెన్యూవల్ చేయించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా లంగర్‌హౌస్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి పేస్టు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. కల్తీ పేస్టును ఎలాంటి ఎక్స్‌పైరీ డేట్ లేకుండా రెస్టారెంట్లు, హెటళ్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
అదిరే రుచి - నాణ్యత ఛీ.. ఛీ.. - బయట తినాలంటేనే వణికిపోతున్న నగరవాసులు
ఎలాంటి అనుమతులు లేకుండా దందా : ప్రమాదకరమైన రసానయాలు ఉపయోగించి ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.4,45,380 విలువైన 835.5 కిలోల కల్తీ అల్లంవెల్లుల్లి పేస్టును పోలీసులు సీజ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా 'హీనా జింజర్ గార్లిక్ పేస్ట్' అనే పేరుతో ఈ దందా నిర్వహిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల కాలంలో ఉద్యోగాళ్లో బీజీతో చిన్నచిన్న వాటిని కూడా షాపుల్లో కొంటున్నారు. దాన్నే ఆసరాగా చేసుకుంటున్నారు కేటుగాళ్లు. సాధారణంగా చేసే దాదాపు వంటకాల్లో అల్లంవెల్లుల్లి పేస్టును వేస్తారు. కానీ అది తయారు చేసుకోవాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ఇందుకు 'బయట కొంటే ఏముంది దొరికేస్తుంది, సమయం కలిసి వస్తుంది' అనుకుని బయట తీసుకుంటున్నారు. అదే మీ కొంపముంచుతుంది. ఆ చిన్నదాన్నే సొమ్ము చేసుకుని కల్తీ వస్తువులతో పాటు అనారోగ్యాన్ని ఆఫర్‌గా ఇస్తున్నారు మాయగాళ్లు. సో ఇక నుంచి కాస్త జాగ్రత్త వహించండి.
కుళ్లిన మాంసం, బూజుపట్టిన కూరగాయలు - ఆ రెస్టారెంట్లో తింటే అంతే! - Food Inspections in peddapalli