ETV Bharat / state

సైకిల్​పై మంత్రి కొండా సురేఖ సవారీ

వరంగల్‌లో సైకిలెక్కి సందడి చేసిన మంత్రి కొండా సురేఖ - భర్త కొండా మురళి జన్మదినోత్సవం పురస్కరించుకుని విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

Minister Konda Surekha On Bicycle
Minister Konda Surekha Distributed Bicycles (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Minister Konda Surekha Bicycle Riding : రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఎప్పుడూ తనదైన శైలిలో వార్తల్లో ఉంటుంటారు. తాజాగా ఆమె ఇవాళ సైకిల్​పై సవారీ చేస్తూ కనిపించారు. అయితే ఇది ఉదయం ఎక్సర్​సైజ్​ కోసం చేసే సైక్లింగ్ కాదు పాఠశాల విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు చేసిన సైకిల్ రైడింగ్.

ఇంతకీ ఏం జరిగిందంటే ఇవాళ తన భర్త కొండా మురళి జన్మదినోత్సవం సందర్భంగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక బట్టల బజార్‌లోని ఆంధ్ర బాలిక ప్రభుత్వోన్నత పాఠశాలకు వెళ్లారు. అక్కడ విద్యార్థునులకు మంత్రి సురేఖ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులను చూసి తనకు సైకిల్ తొక్కాలని అనిపించింది కాబోలు వెంటనే బాలికలతో కలిసి కొద్ది సేపు సైకిల్ తొక్కి వారిని ఉత్సాహపరిచారు. బాలికలతో పోటీగా సైకిల్‌ నడిపి ఔరా అనిపించారు. విద్యార్థినులు బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.