తెలంగాణ

telangana

ETV Bharat / state

సారొస్తారు - నేడు అసెంబ్లీకి ప్రతిపక్ష నేత కేసీఆర్ - KCR TO TG BUDGET SESSIONS TODAY - KCR TO TG BUDGET SESSIONS TODAY

KCR to Attend Telangana Budget 2024 Sessions : భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్​ ప్రతిపక్షనేత హోదాలో నేడు మొదటిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ఆయన గత రెండు సమావేశాలకు హాజరు కాలేదు. అసెంబ్లీకి రాకుండా ప్రమాణస్వీకారం కూడా విడిగానే చేశారు. ఇప్పుడు ఆయన​ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని పార్టీ నేతలు చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.

Ex CM KCR Attend Telangana Assembly Sessions Today
Ex CM KCR Attend Telangana Assembly Sessions Today (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 7:32 AM IST

Ex CM KCR To Attend Telangana Assembly Sessions Today : మూడోరోజు శాసనసభ సమావేశాల్లో ఓ అరుదైన సన్నివేశం ఆవిష్కృతం కాబోతుంది. భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్​ ప్రతిపక్ష నేత హోదాలో దాదాపు ఏడు నెలలు తర్వాత మొదటిసారి అసెంబ్లీ సమావేశాలకు ఇవాళ హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయం ప్రాచుర్యం సంతరించుకుంది.

అసలు అధికార పక్షాన్ని కేసీఆర్​ ఏవిధంగా ఎదుర్కొంటారనే దానిపైనే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. బడ్జెట్​ సెషన్స్​ రోజు కేసీఆర్​ హాజరవడంతో అసలు మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారో, ఆయనకు మైక్​ ఇస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు సడెన్​గా ప్రతిపక్షంలో కూర్చోవడంతో అసలు ఆయన సభలో ఉంటారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి.

'అనతికాలంలోనే ఆదర్శ పాలన అందించాం - రాష్ట్ర ప్రజల నిర్ణయం ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని నిరుత్సాహపరిచింది' - KCR Meeting with Party Leaders

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్​ మొదటిసారి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. కానీ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన పరిణామాలు మాత్రం బీఆర్​ఎస్​ చతికిలపడేలా చేశాయనే చెప్పాలి. పార్టీ అధినేత కేసీఆర్​ అనారోగ్యానికి గురికావడంతో ఆయన గత రెండు సమావేశాలకు హాజరు కాలేదు. ప్రమాణస్వీకారం కూడా విడిగా చేశారు. ఇదే అధికారపక్షానికి ఆయుధంగా మారి కేసీఆర్​ అసెంబ్లీకి రావాలని, వచ్చి ప్రసంగించాలని విమర్శలు చేసేవారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సహా మంత్రులు పదేపదే కేసీఆర్​ శాసనసభ సమావేశాలకు రాకపోవడాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు.

కేసీఆర్​ అసెంబ్లీకి రాకపోవడంపై సీఎం విమర్శలు : తాజాగా జరుగుతున్న బడ్జెట్​ సమావేశాల్లోనూ మొదటి రెండు రోజులు కేసీఆర్​ సభకు హాజరు కాలేదు. కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి అన్యాయంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా కూడా సీఎం రేవంత్​ రెడ్డి కేసీఆర్​ సభకు రాకపోవడాన్ని ప్రస్తావించారు. కానీ మొదటనే బీఆర్​ఎస్​ పార్టీ వర్గాలు కేసీఆర్​ బడ్జెట్​ సమావేశాలకు వస్తారని ప్రకటన విడుదల చేశారు. అందుకు అనుగుణంగా మాజీ సీఎం కేసీఆర్​ నేడు శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. బడ్జెట్​ ప్రసంగానికి ఆయన హాజరవుతారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్​ఎస్​కు దిష్టి తీసినట్లైంది - నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదు : కేసీఆర్​ - KCR Meet BRS Activists at Erravalli

ABOUT THE AUTHOR

...view details