తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు భరోసా నిధులపై ఈసీ ఆంక్షలు - ఎన్నికల తర్వాతే విడుదలకు ఆదేశం - EC Stopped Rythu Bharosa - EC STOPPED RYTHU BHAROSA

EC on Rythu Bharosa in Telangana : తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తర్వాతనే ఆ నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Etv EC on Rythu Bharosa
EC on Rythu Bharosa in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 5:10 PM IST

Updated : May 7, 2024, 6:54 PM IST

EC on Rythu Bharosa :తెలంగాణలో రైతు భరోసా చెల్లింపులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్​సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాతే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ నెల తొమ్మిదో తేదీలోపు అందరికీ రైతుభరోసా చెల్లింపులు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్.వేణు కుమార్ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు.

సీఎం రేవంత్​ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక తెప్పించుకొంది. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు సంబంధించిన నగదు బదిలీకి ఎలాంటి ప్రచారం లేకుండా గతంలో అనుమతించినట్లు ఈసీ తెలిపింది. గత శాసనసభ ఎన్నికల సమయంలో కూడా అప్పటి ఆర్థిక మంత్రి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రైతుబంధు చెల్లింపులకు అనుమతి నిలిపివేసినట్లు పేర్కొంది.

EC on Rythu Bharosa in Telangana (ETV Bharat)

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా తొమ్మిదో తేదీలోగా చెల్లింపులు పూర్తి చేస్తామని చెప్పడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనేనని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నెల 13న జరిగే లోక్​సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని స్పష్టం చేసింది.

Rythu Bandhu Scheme Funds Released :మరోవైపు ఐదెకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతుభరోసా నిధులను ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఐదెకరాలలోపు ఉన్న రైతులకు గతంలో ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఐదెకరాల పైబడిన వారికి కూడా రైతుభరోసా నిధుల చెల్లింపులు ప్రారంభించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేసింది.

రూ.2000 కోట్లకు పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్నందున దీనిపై అధికార ప్రకటన విడుదల చేయలేదు. మార్చి 28కి ప్రభుత్వం 64,75,320 మంది రైతుల ఖాతాల్లో రూ.5,575 కోట్ల రైతుబంధు డబ్బులను వేసింది. తాజాగా మిగిలిన రైతులకు నిధులు విడుదల చేపట్టింది. ఇంతవరకు మొత్తం 1,11,39,534 ఎకరాలకు సాయం అందింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిసారిగా 2023లోని ఆగస్టులో వానాకాలం సీజన్​కు మొత్తం 1,52,49,486.39 ఎకరాలకు 68,99,976 మంది రైతులకు రూ.7,624.74 కోట్లు విడుదల చేసింది. మరో మూడు రోజుల్లో రైతు భరోసా చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం ఉండగా తాజాగా ఈసీ ఆదేశాల నేపథ్యంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియ ఆగిపోయింది.

గుడ్​న్యూస్ - ఐదు ఎకరాలు దాటిన వారికి 'రైతుబంధు' - RYTHU BANDHU SCHEME FUNDS

రైతులకు గుడ్‌న్యూస్ - రైతుభరోసా నిధుల విడుదల - Rythu Bharosa released

Last Updated : May 7, 2024, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details