Theif Fell From Flyover In Amberpet :దొంగతనం చేస్తే గుట్టుచప్పుడు కాకుండా చేస్తారు. ఇటీవల టెక్నాలజీని వాడి పోలీసులకు చిక్కకుండా కొత్త కొత్త పద్ధతులు వెతికి మరీ దోపిడీలు చేస్తున్నారు. ఉన్న సమయంలో ఎంత దొరికితే అంత దోచుకుని మూడో కంటికి కనపించకుండా, వినిపించకుండా తమపని కానిచ్చి వెళ్లిపోతారు. కానీ ఈ దొంగ రూటే వేరు. మద్యం తాగి దొంగతనానికి పాల్పడ్డాడు. ఎవరూ చూడట్లేదు అనుకున్నాడో ఏమో ఇలా ఇనుప రాడ్లపై చేతు వేశాడో లేదో అలా ఫ్లైఓవర్ మీద నుంచి దూకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకి ఏం జరిగిందంటే.
మద్యం మత్తులో దొంగతనానికి పాల్పడిన వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. దొంగతనం చేస్తుండగా గమనించిన చుట్టుపక్కల వారు అరవడంతో ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పైనుంచి దూకిన ఘటన హైదరాబాద్ అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మద్యం మత్తులో చోరీ - తప్పించుకునేందుకు ఫ్లైఓవర్‌పై నుంచి దూకిన దొంగ (ETV Bharat) 2 రోజుల తర్వాత కళ్లు తెరిచిన ఆ దొంగ - షాక్ ఇచ్చిన పోలీసులు
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఫలక్‌నుమాకు చెందిన రాములు మధ్యాహ్నం 2గంటల సమయంలో మద్యం తాగాడు. అంబర్‌పేట బ్రిడ్జిపైకి ఎక్కాడు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద ఉన్న ఇనుప రాడ్లు దొంగతనం చేయాలనుకున్నాడు. మద్యం సేవించి ఉన్న అతను రాడ్లు తీస్తుండగా గమనించిన కూలీలు గట్టిగా కేకలు వేశాలు. దీంతో కంగారుపడిన రాములు ఫ్లైఓవర్ పై నుంచి కిందికి దూకాడు. ఈ ఘటనలో రాములుకు తీవ్ర గాయాలయ్యాయి. అతని చికిత్స నిమిత్తం అంబర్‌పేట పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కొత్తవారు మీతో ఆ విషయాలు మాట్లాడుతున్నారా? - అయితే జాగ్రత్త పడాల్సిందే!
రూ.లక్షలు పెట్టి కొన్న బైక్ - ఈ చిన్న ఖర్చుతో దొంగల నుంచి కాపాడుకుందాం