తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రగ్స్ అమ్మితే అరెస్టే కాదు, ఆస్తులు కూడా సీజ్ - Freezing Of Property Under NDPS ACT

Drugs Supplying control in Telangana : డ్రగ్స్, గంజాయి విక్రయాలకు పాల్పడే నేరగాళ్లను ఇకనుంచి కటాకటాల్లోకి నెట్టడమే కాకుండా వారి ఆస్తుల్ని సైతం సీజ్‌ చేస్తున్నారు. మత్తు పదార్థాల విక్రయదారులపై చట్టం ప్రకారం ఎన్నిచర్యలు తీసుకుంటున్నప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో తెలిపింది.

Drugs Supplying control in Telangana
Drugs Supplying control in Telangana

By ETV Bharat Telangana Team

Published : Mar 22, 2024, 9:12 PM IST

రోజురోజుకు చాపకింద నీరులా గంజాయి విక్రయం- మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు

Drugs Supplying control in Telangana :రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాల విక్రయం రోజు రోజుకీ చాపకింద నీరులా సాగుతోంది. కొందరు యువకులు కమీషన్ల కోసం ఈ దారిని ఎంచుకుంటున్నారు. మరికొందరు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి స్మగ్లర్లుగా మారుతున్నారు. వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఆయా నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. నిందితులపై చట్టప్రకారం కేసులు నమోదు చేసినా మార్పురావడం లేదు. ఇలాంటి కేసుల్లో ఏళ్ల తరబడి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్‌వ్యవస్థ ఎన్​డీపీఎస్(NDPS) చట్టాన్ని ఉపయోగించి నేరగాళ్ల ఆట కట్టిస్తోంది. ఇకనుంచి మత్తు పదార్థాల విక్రయాలు జరిపినట్లయితే ఈ చట్టం ప్రకారం నిందితుల ఆస్తులు జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. నిందితుల అక్రమ ఆస్తులపై ఆధారాలతో సహా చెన్నైలోని 'సఫేమా' కార్యాలయానికి నివేదికను పంపిస్తారు. దీన్ని సఫేమా లోతుగా పరిశీలించి ఆమోదం తెలిపిన వెంటనే ఆస్తులు జప్తు చేస్తారు.

Drug Supplying Increasing in Telangana : రాష్ట్రంలోడ్రగ్స్, గంజాయి రవాణా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. పట్టుబడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నా దందా ఆగడం లేదు. కొందరు దీన్నో ఆదాయవనరుగా భావిస్తూ యువతే లక్ష్యంగా విక్రయాలు జరుపుతున్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలనుంచి పెద్దఎత్తున గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. ఇతరరాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ఈ డ్రగ్స్‌ను ఇక్కడ ఐదారు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసు గుర్తించారు.

డ్రగ్స్ విక్రయిస్తున్న వారి ఆస్తుల జప్తు
ఇటీవల ముషీరాబాద్‌కు చెందిన డ్రగ్స్‌ విక్రేత సయ్యద్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నిందితుడు కేవలం డ్రగ్స్‌ విక్రయాల ద్వారా కోటి విలువైన కారు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. గతేడాది ఆల్ఫ్రాజోలం విక్రయిస్తూ పట్టుబడ్డ అబ్కారీ శాఖ కానిస్టేబుల్‌ రమేశ్, రంగారెడ్డి జిల్లాకు వెంకటయ్యలు 23 కోట్ల స్థిర, చరాస్థులు కూడగట్టినట్లు టీఎస్ న్యాబ్‌గుర్తించింది. ఈ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. గతేడాది ఆగస్టులో 44 కిలోల గంజాయితో వీరన్న, మధు, ప్రశాంత్‌ అనే ముగ్గురు వ్యక్తులను టీఎస్‌ న్యాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 96.55 లక్షల స్థిర, చరాస్థులను జప్తు చేశారు. ఇటీవల నానక్‌రాంగూడలో గంజాయివిక్రయిస్తున్న నీతూబాయి ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు వారి బ్యాంకు ఖాతాల నుంచి సుమారు 4 కోట్ల ఆస్తుల్ని ఎన్​డీపీఎస్ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details