Drainage System in Nellore District : రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతూ స్వచ్చతకు మారుపేరుగా ఉన్న నెల్లూరు నగరం నేడు మురుగు కూపంగా మారిపోయింది. ఆహ్లాదకరమైన నగరాన్ని అందమైన స్మార్ట్ సిటీగా మార్చకుండా అధికారులు ఆమడ దూరం విసిరేశారు. నగర ప్రణాళికపై అధికారులకు చిత్తశుద్ది లేకపోవడంతో సింహపురి కాస్త దుర్వాసన నగరంగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Nellore Urban Development : విశాలమైన నెల్లూరు నగర అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని పూర్వీకులు పెన్నానది ఒడ్డున నగరాన్ని నిర్మించారు. వరద నీరు పారుదల కోసం 13 కిలోమీటర్లు కాలువలు నగరం చుట్టూ నిర్మాణం చేశారు. కాలువల పక్కనే రోడ్లు నిర్మాణం చేశారు. ఎంతో సుందరంగా నెల్లూరును మార్చారు. కాలానుక్రమంగా పంటకాలువలు కాస్తా మురుగు కాలువలుగా మారాయి. చెత్త, పూడికలతో నిండిపోవడంతో నగరం మొత్తం దుర్వాసన వ్యాపించింది. అధికారులు, కార్పోరేషన్ పాలకులకు ఆలోచన లేమీ కారణంతో పంటకాలువలన్నీ మురుగుకాలువలు మారాల్సి వస్తున్నాయి.
అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ - ఇళ్లల్లోకి వస్తున్న మురుగు నీరు, పట్టించుకోని అధికారులు
Bad Drainage System in Nellore :నెల్లూరు నగరంలో ప్రస్తుతం 9 లక్షల మంది ప్రజలు అనారోగ్య వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. వరద కాలువలు పూడిపోవడంతో చిన్నపాటి వర్షపు నీరు బయటకు వెళ్లక నగర శివారులోని కాలనీలను ముంచేస్తోంది. వర్షపు నీటితో కాలనీలు కాస్త చెరువులుగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షానికే నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్, సండే మార్కెట్, ఎన్టీఆర్ నగరం, వైఎస్సార్ కాలనీలు చెరువులుగా తలపిస్తున్నాయి.