AP CEO Releases 2025 Final Voter List : ఆంధ్రప్రదేశ్లో 2025 జనవరి 1వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 4,14,40,447 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్ల సంఖ్య 2,10,81,814 మందిగా నమోదు కాగా పురుష ఓటర్లు సంఖ్య 2,02,88,543గా నమోదు అయ్యింది. సర్వీసు ఓటర్ల సంఖ్య 66,690గా ఉంది. థర్డ్ జండర్ ఓటర్ల సంఖ్య 3400గా ఉన్నారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాల సంఖ్య 46,397కు పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 232 పోలింగ్ కేంద్రాల పెరుగుదల నమోదు అయ్యింది. గత జాబితాతో పోలిస్తే 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య 5,14,646గా నమోదు అయ్యారు. ఈ మేరకు ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విడుదల చేసారు.
ఇంటి నిర్మాణానికి ఎదురుచూడాల్సిన అవసరం లేదు - ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీ
గేమ్ ఛేంజర్ ఈవెంట్ నుంచి వెళ్తూ ఇద్దరు మృతి - ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కల్యాణ్