CM Chandrababu meets Global CEOs in Davos: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజూ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌ని కలిసిన సీఎం విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని కోరారు. గూగుల్ క్లౌడ్ సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేలా తయారీ యూనిట్‌ని ఏపీలో నెలకొల్పాని సూచించారు. సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని దానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
క్లౌడ్ ప్రొవైడర్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద సంస్థ అయిన గూగుల్ క్లౌడ్ ఇప్పటికే దిల్లీ, ముంబైలో రెండు క్లౌడ్ రీజియన్లు ఏర్పాటు చేసింది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల ఎంవోయూ కుదుర్చుకుంది. ఏఐ వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంపొందించేందుకు ఏపీతో ఒప్పందం చేసుకుంది.
కాకినాడ జిల్లాలో 15 వేల కోట్ల పెట్టుబడి: పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ తౌఫిక్‌తో సీఎం భేటీ అయ్యారు. మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ పెట్రోనాస్ ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మాలిక్యూలస్‌కు సంబంధించి భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2030 కల్లా ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో 13 వేల కోట్ల నుంచి 15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. పెట్రో కెమికల్ హబ్‌గా అవతరిస్తున్న మూలపేటలో, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లోనూ పెట్టుబడులు పెట్టాలని మహమ్మద్ తౌఫిక్‌ని సీఎం ఆహ్వానించారు.
దావోస్‌లో బిజీబిజీగా మంత్రి లోకేశ్ - పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు
విశాఖలో డిజిటల్ హబ్: పెప్సీ కో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీ కో ఫౌండేషన్ ఛైర్మన్ స్టీఫెన్ కెహోతో సీఎం చర్చలు జరిపారు. ఇప్పటికే ఏపీలోని శ్రీ సిటీలో బాటిలింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సీ కో బెవరేజస్ విశాఖను గ్లోబల్ డెలివరీ సెంటర్‌గా చేసుకుని డిజిటల్ హబ్‌ని ఏర్పాటు చేయొచ్చని సీఎం సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్‌ని విశాఖకు విస్తరించాల్సిందిగా కోరారు. కుర్‌కురే తయారీ యూనిట్ ఏర్పాటుతో పాటు పెప్సీ కో తమ సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్ఎఫ్(APCNF)తో భాగస్వామ్యం కావాలని సూచించారు.
బహ్రెయిన్ ప్రధాని కార్యాలయం ప్రతినిధి హమద్ అల్ మహ్మీద్, ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ సీఎం భేటీ అయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలను వివరించిన చంద్రబాబు స్పీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్ కోసం ఏపీకి రావాలని ఆహ్వానించారు.
మహిళలకే కాదు పురుషులకూ పొదుపు సంఘాలు - తొలి విడతగా ఆ జిల్లాలో ఏర్పాటు
పెమ్మసాని చొరవతో నంది'వెలుగులు' - కష్టాలు తీరతాయని ప్రజలు ఆశాభావం