ETV Bharat / state

అప్పుడు ఐటీ - ఇప్పుడు ఏఐ: బిల్‌ గేట్స్‌తో సీఎం చంద్రబాబు సమావేశం - CBN MEETING WITH BILL GATES

మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ భేటీ - పలు అంశాలపై చర్చ

CM Chandra Babu and Minister Lokesh Meets Bill Gates at Davos
CM Chandra Babu and Minister Lokesh Meets Bill Gates at Davos (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2025, 10:27 PM IST

Updated : Jan 22, 2025, 10:55 PM IST

CM Chandra Babu and Minister Lokesh Meet Bill Gates: దావోస్‌ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్‌ పెట్టడంతో హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోయాయని బిల్‌గేట్స్‌కు చంద్రబాబు గుర్తు చేశారు. దక్షిణ భారత్‌లో గేట్స్‌ పౌండేషన్‌ కార్యకలాపాలకు ఏపీని గేట్‌వేగా నిలపాలని లోకేశ్ కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఏర్పాటు చేయనున్న ప్రపంచస్థాయి ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించాలని కోరారు.

మీ అమూల్యమైన సలహాలు ఏపీలో ఐటీ అభివృద్ధికి దోహదం చేస్తాయని బిల్‌గేట్స్‌కి తెలిపారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ హెల్త్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌ని ఏర్పాటు చేయడానికి బిల్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ తరఫున ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఏపీలో ఇన్నోవేషన్‌ ఇంక్యుబేషన్‌ ఎకో సిస్టంని నడపడానికి ఆఫ్రికాలో హెల్త్‌ డ్యాష్‌బోర్డుల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్‌ తరఫున నైపుణ్య సహకారం అందిచాలని విజ్ఞప్తి చేశారు. ఫౌండేషన్‌ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు.

దావోస్​లో బిజీబిజీగా మంత్రి లోకేశ్ - పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు

చంద్రబాబుని కలవడం ఆనందంగా ఉంది: చంద్రబాబుని చాలా కాలం తర్వాత కలవడం చాలా ఆనందంగా ఉందని బిల్‌గేట్స్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 1995లో ఐటీ కోసం 2025లో ఏఐ కోసం బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యాయని చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత బిల్‌గేట్స్‌ని కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్‌ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో రోజూ పెట్టుబడుల వేట కొనసాగించారు. గ్లోబల్‌ కార్పొరేట్‌ కంపెనీల ప్రతనిధులతో సమావేశమై ఏపీలోని అవకాశాలను వివరించారు. గూగుల్‌ క్లౌడ్‌, పెప్సీ కో, పెట్రోనాస్‌ సంస్థ ప్రతినిధులతో చర్చించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

ఏపీలో పెట్టుబడులకు విస్తృత ప్రయత్నాలు - 15కు పైగా సంస్థలతో సీఎం వరుస భేటీలు

భావనపాడులో పెట్రో కెమికల్‌ హబ్‌ ఏర్పాటు చేయండి - లక్ష్మీమిత్తల్‌ను కోరిన నారా లోకేశ్‌

Last Updated : Jan 22, 2025, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.